Take a fresh look at your lifestyle.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభం

ఖమ్మం సిటి, మే 21 (ప్రజాతంత్ర విలేకరి) : తలసేమియా వ్యాధిగ్రస్తుల ను ఆదుకోవడానికి బొమ్మా గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌గురువారం ప్రారంభించారు. స్తానిక అల్లీపురం వద్దగల బొమ్మ విద్యాసంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించటం అభినందనీయమన్నారు. అనంతరం ఆయన బొమ్మా విద్యాసంస్తల్లో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులకు సమకూర్చిన నిత్యావసర సరుకులను అందజేసారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్‌ ‌డాక్టర్‌ ‌గుగులోతు పాపాలా•, జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌, ‌కార్పోరేటర్లు కమర్తపు మురళి, మందడపు మనోహర్‌ ,‌తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవటానికి కృషి చేస్తున్న సంకల్ప సంస్త బాద్యులు డాక్టర్‌ ‌రాజేష్‌గార్గె, డాక్టర్‌ ‌కూరపాటి ప్రదీప్‌, ‌బొమ్మా విద్యాసంస్థల అధినేత బొమ్మా రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy