Take a fresh look at your lifestyle.

తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతులు

బుధవారం కురిసిన అకాల వర్షానికి.. రైతులకు అపార నష్టాన్ని చవిచూసేలా చేసింది. అరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకుందామని మార్కేట్‌ ‌యార్డుకు తీసుకువచ్చి 45 రోజులకు పైగా గడుస్తున్న సంభందిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో బుధవారం కురిసిన భారీ అకాల వర్షానికి వర్షకోండ, ఇతర కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం తడిసి ముధ్దయ్యింది. ఒక్కసారిగా వర్షం కురువడంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం సంచులు నీటిలో మొత్తం తడిసి పోయాయి. కొనుగోలు కేంద్రం చెరువును తలపించింది. వర్షానికి తడిసిన ధాన్యాన్ని, వరద నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు వర్షంలో నానా కష్టాలు పడ్డారు.

కొనుగోలు కేంద్ర నిర్వహకులు రైతులకు టార్ఫాలిన్లు అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోన్నారు. వర్షకోండ గ్రామంలో ఐకేపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో లారీల కోరతతో, సరిపోయే కూలీలు అందుభాటులో లేక ధాన్యం తూకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పాటు నత్తకడకన కోనసాగుతున్నాయి. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే రోజుల తరబడి నిరిక్షించాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనుగోల్లు సాగితే ఇంకా నెల రోజులు పట్టేలా ఉందని ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కొనుగోల్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply