Take a fresh look at your lifestyle.

స్టాప్‌ ‌హేట్‌..!

‘‘‌హరిద్వార్‌ ‌సదస్సులో వినబడిన విద్వేషం, చిమ్మిన విషం ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలోని ముస్లింలను సమూలంగా నిర్మూలించాలని పిలుపు నిచ్చారు అక్కడ. హిందూ రక్ష సేన అనే సంస్థ అధిపతి ప్రబోధానంద గిరి..మైన్మార్‌ ‌లో లాగా ఆ జాతినే లేకుండా చేయాలి. మన పోలీసులు, మన రాజకీయనేతలు, మన సైన్యం..ప్రతి హిందూ ఆయుధాలు చేత బట్టాలి. సామూహిక నిర్మూలనకు దిగాలి. మరో దారి లేదు అని పిలుపు నిచ్చారు…’’

ఉత్తరాఖండ్‌ పోలీసులకు చివరికి కేసు పెట్టక తప్పలేదు. ఎఫ్‌ఐఆర్‌ అయితే రిజిస్టర్‌ ‌చేశారు కానీ అందులో కూడా అసలు వ్యక్తుల పేర్లు ఇంకా చేర్చలేదు. హరిద్వార్‌ ‌లో ఈ నెల 17 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకూ ధర్మసంసద్‌ ‌పేరుతో జరిగిన సదస్సులో హిందు మతోద్ధారకులమని చెప్పుకుంటున్న కొందరు చేసిన విద్వేష ప్రసంగాలకు ప్రపంచమే నివ్వెర పోయింది. ఉత్తరాఖండ్‌ ‌పోలీసులకు మాత్రం దానిపై దృష్టి సారించాలనిపించలేదు. విలేఖరులు ప్రశ్నించినపుడు.. ఏదీ మాకెవరూ ఫిర్యాదు చేయలేదే అన్నారు. చివరికి తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు సాకేత్‌ ‌గోఖలే ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ ‌రిజిస్టర్‌ ‌చేశారు. అందులో జితేందర్‌ ‌నారాయణ్‌ అనే వ్యక్తి పేరు ఒక్కటే చేర్చారు. ఈ జితేంద్ర నారాయణ్‌ ‌పూర్వాశ్రమంలో వాసిమ్‌ ‌రిజ్వి అనే షియా ముస్లిం నేత. ఉత్తరప్రదేశ్‌ ‌షియా వక్ఫ్ ‌బోర్డు ఛైర్మన్‌ ‌గా కూడా చేశారు. సడన్‌ ‌గా మతం మార్చుకుని హిందువు అయ్యారు. ఇతను కూడా తక్కువేం కాదు. ముస్లింలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు.

అయితే హరిద్వార్‌ ‌సదస్సులో వినబడిన విద్వేషం, చిమ్మిన విషం ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలోని ముస్లింలను సమూలంగా నిర్మూలించాలని పిలుపు నిచ్చారు అక్కడ. హిందూ రక్ష సేన అనే సంస్థ అధిపతి ప్రబోధానంద గిరి..మైన్మార్‌ ‌లో లాగా ఆ జాతినే లేకుండా చేయాలి. మన పోలీసులు, మన రాజకీయనేతలు, మన సైన్యం..ప్రతి హిందూ ఆయుధాలు చేత బట్టాలి. సామూహిక నిర్మూలనకు దిగాలి. మరో దారి లేదు అని పిలుపు నిచ్చారు. సాధ్వి అన్నపూర్ణ పేరుతో చలామణీ అయ్యే పూజా షకున్‌ ‌పాండే అనే మహిళ కూడా..ముస్లింలను అందరినీ సంహరించాలని పిలుపు నిచ్చారు. 20 లక్షల మందిని చంపగలిగే 100 మంది సైనికులు కావాలి మనకు అని ఆమె తన ప్రసంగంలో అన్నారు. ఈ సదస్సును నిర్వహించిన హిందుత్వ వాద నేత యతి నరిసింఘానంద్‌ ‌గిరి..ఎల్టిటిఇ ప్రభాకరన్‌, ‌భిద్రన్‌ ‌వాలా లాగా మారే ప్రతి హిందువుకూ కోటి రూపాయలు ఇస్తానన్నారు. వీరి ప్రసంగాల వీడియోలు వైరల్‌ ‌గా మారాయి. ఇండియాలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఖండనలు వచ్చాయి. దేశంలో ఇద్దరు మాజీ సేనాధిపతులు ఈ ప్రసంగాలను ఖండించారు. టెన్నిస్‌ ‌స్టార్‌ ‌మార్టినా నవ్రతిలోవా కూడా ట్విట్టర్‌ ‌లో తీవ్రంగా స్పందిచారు. స్టాప్‌ ‌హేట్‌ అనే హ్యాష్‌ ‌ట్యాగ్‌ ‌పెద్ద ఎత్తున ట్రెండ్‌ అయింది.

ఈ విద్వేష ప్రచారకులు మాత్రం తాము తప్పేమీ చేయలేదంటున్నారు. నేనన్న మాటలకు నేనీమీ సిగ్గు పడడం లేదు. పోలీసులంటే నాకేమీ భయం లేదు. నేనన్న దానికి కట్టుబడి ఉంటాను అని ప్రబోధానంద్‌ ‌గిరి ఆ తర్వాత మీడియాతో అన్నారు. పోలీసులంటే తనకు భయం లేదని సాధ్వి అన్నపూర్ణ కూడా అన్నారు. భారత రాజ్యాంగంలోనే లోపం ఉంది. భారతీయులు పూజించాల్సింది నాధూరాం గాడ్సేను అని ఆమె అన్నారు. భోపాల్‌ ‌బిజెపి ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ‌లాగా ఈమెకు కూడా గాంధీ గారిని చంపిన గాడ్సే దేవుడన్న మాట.

హరిద్వార్‌ ‌సదస్సులో అన్న మాటలకు కట్టుబడి ఉంటామని ఒకపక్క వారు చెబుతుంటే ఉత్తరాఖండ్‌ ‌పోలీసు అధికారులు మాత్రం వారిపై కేసు పెట్టేందుకు మీనమేషాలు లెక్కేస్తున్నారు. అదేమిటని అడిగితే ఆ వీడియోలు సరైనవో కావో ముందు చూడాలంటున్నారు. ప్రబోధానంద్‌ ‌గిరి తరచూ ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ‌తో కలిసి కనబడతారు. ఉత్తరాఖండ్‌ ‌ముఖ్యమంత్రి పుష్కర్‌ ‌ధామి కూడా ఈయనకు సన్నిహితుడే. హరిద్వార్‌ ‌సదస్సుకు బీజెపి నాయకుడు అశ్వనీ ఉపాధ్యాయ, బీజెపి మహిళా మోర్చా నాయకురాలు ఉదిత త్యాగి హాజరయ్యారు. హరిద్వార్‌ ‌సదస్సులో వినబడ్డ విద్వేష ప్రసంగాలను ఇంతవరకూ ఒక్క బీజెపి నేత కూడా ఖండించలేదు.

జెనొసైడ్‌..అం‌టే ఒక వర్గం ప్రజలను సామూహికంగా సంహరించడం..ప్రపంచంలోనే పెద్దదయిన ప్రజాస్వామ్య దేశంలో 21వ శతాబ్దంలో ఇలాంటి మాట బహిరంగంగా అనేందుకు హిందుత్వ వాదులు సందేహించడం లేదు. అనడమే కాదు..అవును అన్నాం అయితే ఏంటట అని తిరిగి ప్రశ్నిస్తున్నాకు కూడా.. ఒక మైనారిటీ మతం ప్రజలను పూర్తిగా నిర్మూలిస్తామన్న మాటలు చర్మం మొద్దుబారి పోయిన మనకు దిగ్భ్రాంతి కలిగించవేమో కానీ ప్రపంచం నివ్వెరపోతుంది. హరిద్వార్‌ ‌సదస్సులో జెనొసైడ్‌ ‌కు సామూహిక నిర్మూలనకు పిలుపు ఇవ్వడం ద్వారా వారు తీవ్రమైన నేరం చేశారు. ఆ నేరం చేసినందుకు వారిని ప్రాసిక్యూట్‌ ‌చేయకపోతే అది భారతదేశానికే మచ్చ..

Leave a Reply