Take a fresh look at your lifestyle.

భగ్నమయిన నాలుగు దశాబ్దాల శాంతి

వాస్తవాలను అంగీకరించని వారికి ఈ నేలపై అంతా  సాధారణంగానూ,  సరైన రీతిలో కనిపిస్తుంది..! చైనా పీపుల్స్ ఆర్మీ  (పిఎల్‌ఎ) ‌సైనికుల చేతిలో  వాస్తవాధీన రేఖ వద్ద  గస్తీ కాస్తున్న మన సైనికులు  20 మంది కొద్ది రోజుల క్రితం  అత్యంత దారుణంగా హత్య కు గురయ్యారు. చైనా, భారత్‌ ‌సరిహద్దు దళాలు పరస్పరం భౌతిక దాడులకు దిగారు. దాడులలో ఇరువురి మధ్య ఎటువంటి కాల్పులు గాని ,బాంబులు విసురు కోవడం గానీ జరగలేదు. చేతికి దొరికిన బండ రాళ్లతో,మేకులు కొట్టిన బ్యాట్‌ ,‌ముళ్ల తీగ చుట్టిన కర్రలతో చైనా దళాలు మన సైనికుల పై దాడి చేసి  హతమార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ముఖాముఖి గా ..ఒక ప్రదేశంలో   జరిగిందన్నది స్పష్టం ..దాడులు జరిగిన ప్రాంతం ఏ దేశం ఆధీనంలో ఉన్నది అన్న అంశం పై ..భారత రక్షణ శాఖ వివరణ ఇవ్వాలి ..! ఈ వాస్తవాన్ని జాతీయ స్థాయి నాయకులు   అంగీకరించకుండా , వాక్‌ ‌చాతుర్యంతో ఏవేవో   చెప్పుకుంటూ వొచ్చారు.మన భూభాగంలోకి ఎవరూ చొచ్చుకుని రాలేదనీ, మన సైనికులెవరినీ తీసుకుని వెళ్ళలేదని వివరణ  ఇచ్చారు . చైనా సైనికులు చొచ్చుకుని రాకపోతే,  అమరులైన మన జవాన్లు ఆవలి వైపు వారిని ఏం చేశారు..?  ఇలా వాదిస్తున్న వారి వాక్‌ ‌చాతుర్యం  ఎంత గొప్పదంటే,మన భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకుని రాలేదు. అంటే మన సైనికులు చైనా  భూభాగంలోకి వెళ్ళి పిఎల్‌ ఎ ‌సైనికుల చేతిలో మరణించారా..? ఇరు  దేశాల సైనికుల ఘర్షణలు ప్రారంభం అయిన నాటి నుంచి చైనా  అనేక రీతుల్లో ప్రకటనలు చేసింది.  చైనా ఆ ప్రకటనల్లో ఎంత వరకూ వెళ్ళిందంటే గాల్వాన్‌ ‌లోయపై హక్కు తమదేననేంతవరకూ., భారత సైనికులు  అక్రమంగా, ఉద్దేశ్య పూర్వకంగా తమ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చారని చైనా ఆరోపిస్తోంది.చైనా సైనికులు మన భూభాగంలోకి ప్రవేశించలేదనీ, మన వాళ్లు ఎవరినీ తీసుకుని వెళ్ళలేదంటూ మన  నాయకులు చెబుతున్న ప్రకటనచైనా వాదాన్ని బలపరుస్తున్నట్టుగా లేదా..!   అంతేకాక, గాల్వన్‌ ‌లోయను భారత్‌ ‌చైనాకు అప్పగించిందని అర్ధమా..!

ఏమైనప్పటికీ   జాతీయ నాయకత్వం ప్రకటనలు   భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ  జారీ చేసిన   ప్రకటనలకు విరుద్దంగా ఉన్నాయి.20 మంది మన సైనుకుల మరణానికి దారి తీసిన పరిస్థితులపై విదేశాంగ శాఖ  విడుదల చేసిన ప్రకటనలకూ  జాతీయ నాయకత్వం చేసిన ప్రకటనకూ పొంతన లేదు.  మన విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో  మన సైనికులు పది మందిని    చైనా సైనికులు పట్టుకుని కొంత సేపు తమ చెరలో ఉంచుకుని విడుదల చేశారని  పేర్కొనడం జరిగింది.  ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటనలో మన సైనికులు ఎవరూ పట్టుబడలేదంటూ విస్పష్టంగా ప్రకటించారు.  మన భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకుని రాకపోతే ఈ పది మంది భారత సైనికులను వారు ఎలా తీసుకుని వెళ్ళి తమ చెరలో ఉంచుకోగలిగారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు  కోరడాన్ని జాతి వ్యతిరేకతగా వారు పరిగణించవచ్చు..లేదా స్పృహలేని  రాజకీయాలుగా అభివర్ణించవచ్చు. పిఎల్‌ ఏ ‌సైనికులు   హింసకు పాల్పడ్డారన్నది వాస్తవం. దీనిని ఎవరూ ఖండించడం లేదు.  దీనిని బట్టి స్థానికంగా  ఇరు దేశాల దళాల్లో   సమతూకం  లేకపోవడం వల్ల వచ్చింది కాదు.  ఉద్రిక్తతలు సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి.  చైనా ఏమంటోందంటే స్థానిక  కమాండర్లు చూసుకుంటున్నారని,    పర్వత ప్రాంతంలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో తమ కమాండర్లు పని చేస్తున్నారని చైనా అంటోంది. అయితే  మన నాయకత్వం మాత్రం మన భూభాగంలోకి ఎటువంటి చొరబాట్లు జరగలేదని  చెప్పడానికి  ప్రయత్నిస్తోంది.  సరిహద్దుల్లో మన స్థావరాలపై దాడి జరగలేదని స్పష్టం చేస్తోంది. అయితే, అక్కడ  పిఎల్‌ ఏ ‌సైనికులతో జరిగిన  ఎన్‌కౌంటర్‌   ‌రాజకీయ నాయకుల వాక్‌ ‌చాతుర్యంతో  రాజకీయ నాయకత్వం వాస్తవాన్ని కప్పిపుచ్చుతోంది. గాల్వాన్‌ ‌లోయ వాస్తవాధీన రేఖ ఆవల చైనా వైపు    తమదేనని చైనా చేస్తున్న వాదనను మన దేశం ఖండించింది. దాంతో చైనా మన వారిపై దాడికి పాల్పడి ఉండవచ్చు.  అయితే, అందుకు భిన్నంగా  అసలు మన స్థావరాలపై దాడి జరగలేదనీ, మన భూభాగంలోకి ఎవరూ చొచ్చుకుని రాలేదని చెప్పడం వాక్‌ ‌చాతుర్యమే.  గాల్వాన్‌ ‌ఘటన ఒక్కరోజులో జరిగిందికాదు. పిఎల్‌ ఏ ‌స్థానిక కమాండర్లకు విచక్షణాధికారాలు లేవు. చైనా నాయకత్వం  ఆదేశాలు లేనిదే వారు అడుగు ముందుకు వేయలేరు.

గాల్వానా లోయ ఘటన నేపథ్యం చూస్తే మన భూభాగంలోకి ఎవరూ చొచ్చుకుని రాలేదని  చెప్పడం వాక్‌ ‌చాతుర్యం తప్ప మరేమీ కాదు.అంతేకాక ఇది కేవలం  భద్రతా పరమైన అంశం కాదు.  రాజకీయ చాతుర్యంతో తప్పించుకోవడానికి చేసిన ప్రకటన భావావేశంతో కూడింది తప్ప  మరేమీ కాదు.ఈ మొత్తం పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే ఎక్కడో చాలా దారుణంగా పక్కదారి పట్టి ఉండవచ్చుననిపిస్తోంది. చైనా, పాకిస్తాన్‌ ‌ప్రమేయం   లేకుండా నేపాలీలు  చొరవ తీసుకోరు. 20 మంది భారత సైనికులు మరణించిన ఘటన భారత సైనికుల సాహసోపేతానికి, దృఢత్వానికి నిదర్శనం.. తలుచుకుంటే గగుర్పాటు కలుగుతోంది  ఇలాంటి  సంఘటన ఈ మధ్య జరగలేదు.  వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్నాయి. నాలుగు దశాబ్దాల శాంతిని ఇది చెదరగొట్టింది.  అయితే, జాతీయ రాజకీయ  నాయకత్వం తన తప్పును అంగీకరించదు.  సైనికుల త్యాగాలపై రాజకీయాలు చేస్తుంది.  పాకిస్తాన్‌ ‌మరో రీతిలో  వాక్‌ ‌చాతుర్య ప్రకటనలు చేస్తుంది. చైనా మాత్రం  యావత్‌ ‌ప్రపంచం ముందు తన చర్యలను సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తుంది.  బాలాకోట్‌ ‌లో పాక్‌ ఉ‌గ్రవాదుల దాడికి ప్రతిగా సమాధానం చెప్పడం వంటిది కాదు ఇది.  చైనా ది తప్పని  దౌత్యపరంగా, రాజకీయంగా, నైతికంగా నిరూపించగలగాలి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నించాలి. మన భూభాగంలోకి  ఎవరూ చొచ్చుకుని రాలేదు, ఎవరినీ పట్టుకుని పోలేదు వంటి ప్రకటనలు చైనాకే మేలు చేస్తాయి.  2020 సంవత్సరం 1962 కాదని గుర్తుంచుకోవాలి. సైనికులకు తెలుసు…  వారు ఏం చేయాలో  వారికి తెలుసు.. జాతీయ నాయకత్వం వాక్‌ ‌చాతుర్యంతో కాకుండా  వాస్తవ పరిస్థితిని ఆధారంగా   నిర్ణయాలు తీసుకోవాలి.

Leave a Reply