Take a fresh look at your lifestyle.

చెరువు కట్ట తెగి ఇళ్లలోకి ప్రవేశించిన నీరు

ప్రమాదం నుండి రక్షించిన గ్రామపంచాయతీ పాలకవర్గం

సూర్యాపేట, సెప్టెంబర్‌26, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలోని మునగాల మండలంలోని కలకోవ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండి, చెరువు కట్ట తెగి గ్రామంలోని ఇండ్లలోకి నీరు చేరిన పరిస్థితి శనివారం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భయంకరమైన ఈదురుగాలుల మధ్య కలకోవ గ్రామం కకావికల మైంది. కలకోవ గ్రామం జలమయమైన విషయం గ్రామ సర్పంచ్‌ ‌కొంపెల్లి సుజాత వీరబాబు గుర్తించి వెంటనే మండల అధికారులకు సమాచారాన్ని అందజేశారు.
దీంతో అధికారులు గ్రామంలోకి చేరుకునే లోపే కలకోవ సర్పంచ్‌, ‌గ్రామ పంచాయతీ పాలకవర్గం జెసిబి సాయంతో గ్రామానికి ప్రమాదం లేకుండా నీళ్లు తొలగించారు. అంతేకాకుండా కలకోవ గ్రామం లో చెరువు నిండక అనేక సంవత్సరాలు అవుతున్న కారణంగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఒకేసారి చెరువు అలుగు పోతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మండల తహశీల్దార్‌ ‌కరుణశ్రీ, ఎస్సై సత్యనారాయణ, ఎంపిటిసి గన్న భవాని నరసింహారావులు గ్రామాన్ని సందర్శించారు. ప్రమాదం అంచున్న ఉన్న గ్రామాన్ని రక్షించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం యొక్క పనితీరును చూసి హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply