Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఆగని కొరోనా పెరుగుతున్న కేసులతో గ్రేటర్‌లో ఆందోళన

రాష్ట్రంలో కొరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరువైంది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నయి. మంగళవారం 879 మందికి వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వచ్చింది. ఇందులో గ్రేటర్‌ ‌హై దరాబాద్‌లోనే 652 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మేడ్చల్‌ ‌జిల్లాలో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 112 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 64,
వరంగల్‌ ‌రూరల్‌ ‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్‌ అర్బన్‌ ‌లో 9, జనగామలో 7, సంగారెడ్డిలో 2, మంచిర్యాలలో 2, మహబూబాబాద్‌ ‌లో 2, మెదక్‌ ‌లో ఒకటి, నాగర్‌ ‌కర్నూల్లో 4 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9,553కు పెరిగింది. ఇందులో 4,224 మంది వైరస్‌ ‌నుంచి కోలుకోగా, 5,109 ఆక్టివ్‌ ‌కేసులు ఉన్నట్టు పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ ‌ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో పనిచేసే మార్షల్‌ ఎ. ‌జనార్థన్‌ ‌కు కరోనా గా నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనతో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నెల 18 నుంచి 20 వరకు ఆయనతోపాటు డ్యూటీలో ఉన్న మార్షల్స్ ‌వివరాలు సేకరించారు. కాగా, కరీంనగర్‌ ‌జిల్లా ఇల్లంతకుంట మండలం మల్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ ‌పాజిటివ్‌ ‌గా తేలింది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌ ‌నర్స్, ‌వార్డు బాయ్‌ ‌కి కరోనా పాజిటివ్‌ ‌నిర్దారణ అయ్యింది. దీంతో హాస్పిటల్‌ ‌సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనాతో మంగళవారం మరో ముగ్గురు చనిపోయారని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మరణాల సంఖ్య 220కి పెరిగింది. మృతుల వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. రాష్ట్రంలో టెస్ట్ ‌చేపించుకుంటున్న ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ‌వస్తోంది. రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 63,249 కు చేరింది.

నాలాగా ఎవరూ కరోనా బారిన పడరాదు
ఎమ్మెల్యే బీగాల గణెశ్‌ ‌వీడియో సందేశం
తనలాగా ఎవరు కూడా కరోనా  బారిన పడరాదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణెళిష్‌ ‌గుప్తా  అన్నారు. ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ద్వారానే వైరస్‌ ‌సోకినట్టు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ ‌బంజారాహిల్స్‌లోని తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి కోలుకొని నియోజకవర్గ ప్రజలను కలుస్తానని గణెళిష్‌ ‌గుప్తా చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వాట్సప్‌ ‌సందేశాన్ని విడుదల చేశారు. తనపై ప్రేమ చూపిన ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ అధైర్యపడొద్దు. త్వరలో  చేయించుకోబోయే టెస్ట్‌లో నెగెటివ్‌ ‌వస్తుందని ఆశిస్తున్నాను.  ముందుకు త్వరలోనే వస్తాను. అందరు తప్పకుండా మాస్కులు ధరించండి. సామాజిక దూరం పాటించండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న నేనే కరోనా బారిన పడ్డాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నిజామాబాద్‌ ‌నగర ప్రజలు ఎవరూ కూడా నాలాగా కరోనా బారిన పడొద్దని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’  అని గణెళిష్‌ ‌గుప్తా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply