ఎస్సారెస్పీ, ఎల్ఎండి కాలువల నుండి జూలై 15 నుండి విడుదల అయ్యే వానా కాలం పంటలకు సాగునీరును చివరి ఆయకట్టు, చిట్ట చివరి రైతుకు కూడా నీరు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఈటెల రాజేందర్‌తో పలువురు మంత్రులు ఆదేశించారు. బుధవారం హన్మకొండలోని సిఎస్ఆర్ గార్డెన్లో ఎస్సారెస్పీ, ఎల్ఎండి కాలువల నీటి విడుదల పై ఉన్నత స్థాయి సమావేశంలో నీటిని డిస్ట్రిబ్యూషన్ సరిగా జరిగేలా చూడా పజా ప్రతినిధులు అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమన్వయం అవసరం నీటి వృథా కాకుండా చూసుకోవాలి ఎస్సారెస్పీ కాలువల ద్వారా నూటికి నూరు శాతం చెరువులు నింపుతున్నామని, రెండో పంటలకు సాగు నీరు అందాలని ఆదేశించారు. కాలువల పనులకు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. పాత కాలువలను మరమ్మతులు చేయాలని, కాలువల కింద అవసరమైన మేరకు భూములను సేకరించాలన్నారు. 100కు 100 శాతం చివరి భూమికి, చివరి పంటకి సాగు నీరు అందించాలని, 9లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువల ద్వారా 7 జిల్లాల్లో, 1677 చెరువులను నింపడానికి, 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడానికి కృషి చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టు సామర్థ్యం, కాలు వల మరమ్మతులు, రైతుల పంటలు, తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయా కర్ రావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్ రెడ్డిరాష్ట్ర రైతు బంధు కన్వీనర్ పల్లె రాజేశ్వర్ రెడ్డి,వరంగల్ అర్బన్, వరంగల్ రూర ల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహ బూబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లు, ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాష్, రాజమల్లు యాదవ్, కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యులు డోర్నకల్, భూపా)పల్లి, నర్సంపేట, పాలేరు, తుంగతుర్తి, వర్ధన్నపేట, మహబూబాబాద్, పరకాల, వరంగల్ తూర్పు శాసన సభ్యులు,వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, సూర్యాపేట, భూపా)పల్లి, మహబూ బాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్లు పాల్గొన్నారు.