ప్రత్యేక పూజలతో నుడు గరుడ సేవకు వినయోగం
తిరుమల,సెప్టెంబర్ 22 : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు మంగళవారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు ఛైర్మన్ డియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు బోర్డు సభ్యులు డిపి.అనంత, శేఖర్‌రెడ్డి, గోవిందహరి, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ జాయింట్ కమిషనర్ ధనపాల్ రవిచంద్ర, ఈవో ఇలంగోవన్ పాల్గొన్నారు.
శ్రీవారికి స్నపన తిరుంజనం
ఇదిలావుంటే మొదటి సారిగా కివిఫ్రూట్, నెమలి ఈకల మాలలు, కిరీటాలతో శాస్తోక్త్రగా శ్రీవారికి స్నపనతిరుమంజనం నిర్వ హించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో మొదటి సారిగా కివిఫ్రూట్, నెమలి ఈకలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపనతిరుమంజనం శాస్తోక్త్రగా జరిగింది. రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ గోవిందాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అభయమిచ్చారు. పలురకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు. కివిఫ్రూట్ – ఫైనాపిల్, నెల్లికాయలు, బ్లాక్ వెల్వెట్, ముత్యాలు – నందివర్థనం, నెమలి ఈకలు, పవిత్రమాలలు, వట్టి వేరు, రోజ్ పెటల్స్‌తో తయారు చేసిన మాలలు, కిరీటాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.