Take a fresh look at your lifestyle.

వచ్చే నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల,ఆగస్ట్ 27 : ‌వచ్చేనెలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు నిర్వహించనున్నాయి. సెప్టెంబర్‌ 1‌న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇక సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్‌ ‌సవారి ఉత్సవం జరుగుతుంది.

ఇదిలావుంటే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 28 శుక్రవారం నుండి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు శాస్తోక్త్రగా నిర్వహించనున్నారు. అంకురా ర్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం పవితప్రతిష్ఠ,  సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పించ నున్నారు. 30న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. కోవిడ్‌ 19 ‌నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Leave a Reply