Take a fresh look at your lifestyle.

అవసరాన్ని బట్టి శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి

జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు
అవసరాన్ని బట్టి శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ ‌రావు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. వొచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్‌ ‌శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందన్నారు.
ట్రాన్స్ఫార్మర్స్, ‌స్తంభాలు అదనంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌లాంటి సిటీలో సెల్లర్‌లో ఉన్న వి•టర్లను మొదటి అంతస్తులోకి అమర్చుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏమైనా విద్యుత్‌ ‌పరంగా సమస్యలు ఉంటే తక్షణమే టోల్‌ ‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 7382072104, 73820 72106 , 73820 71574 లతో పాటు 1912, 100 లను అందుబాటులో ఉంచామని సీఎండీ ప్రభాకర్‌ ‌రావు తెలిపారు.

Leave a Reply