బిజెపిలో చేరుతున్నట్లు ‘కూన’ ప్రకటన
ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టా డుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీ నామా చేసినట్లు ఆయన ప్రకటిం చారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ఈ సంద ర్భంగా కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. తాను గత మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిపొందానని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేశానని, అయితే గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగిస్తున్నాయని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఈ పరిణామాలు చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను, హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వొచ్చారని, దీనికి ఉదాహరణే దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైందని శ్రీశైలం గౌడ్ అన్నారు. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరుగడానికి కూడా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని అన్నారు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమనే నిర్ణయానికి వొచ్చానని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వొచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు.