Take a fresh look at your lifestyle.

‘శ్రీ‌రాంజన్మభూమి తీర్థక్ష్రే ‌ట్రస్ట్’లోక్‌సభలో ప్రకటన చేసిన ప్రధాని మోడీ

Sriranjanmabhoomi Theerthakshree Trust PM Modi announces in the Lok Sabha
అయోధ్యలో మందిర నిర్మాణానికి ముందడుగు లోక్‌సభలో ప్రకటన చేసిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ… నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉదయం కేబినెట్‌ ‌నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం. దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే విధంగా.. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు వసుదైక కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. కాగా దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హాల్లో భాగమైన రామమందిర నిర్మాణానికి ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్ర కేబినెట్‌ ‌బుధవారం నిర్ణయం తీసుకంది.

ఇక ఈ చారిత్రాత్మక తీర్పును భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ ‌గొగోయ్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణ ఏర్పాటుకు ట్రస్ట్ ‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంధ్ర మోడీ లోక్‌సభలో ప్రకటించారు. సుప్రీం ఆదేశాల మేరకు తాము ఇప్పుడు రామమందిర నిర్మాణంకోసం ట్రస్ట్ ‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ట్రస్ట్ ‌పేరు ’శ్రీరాంజన్మ భూమి తీర్థ క్ష్రే ‌ట్రస్ట్’ అని నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ట్రస్ట్ ఆలయనిర్మాణంతో పాటు.. దాని సంబంధ విషయాలపై నిర్ణాయాలను స్వతంత్రంగా తీసుకుంటుందని ఆయన తెలిపారు. నిర్మాణం కోసం ఉన్న దాదాపు 67 ఎకరాలలో ఆలయనిర్మాణం జరుగుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించినట్టుగానే సున్నీ వక్ఫ్ ‌బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌సర్కార్‌ అం‌దిస్తున్నట్లు చెప్పారు.మన దేశం.. మన సంసృతి, మన పరంపర వసుదైక కుటుంబంతో పాటు ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుందని ముందడుకు ప్రేరణ అని మోడీ చెప్పారు. భారత దేశంలో హిందువైనా, సిక్కు అయినా, ముస్లిమైనా ఒకటేనని చెప్పారు. ఏపరివారానికి చెందిన వారైనా.. వారందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. తన ప్రభుత్వం సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌ ‌తోనే ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ రామమందిర నిర్మాణానికి కలిసిరావాలని కోరారు. ఇదిలావుంటే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్టులో ఓ దళితుడికి కూడా స్థానం కల్పించినట్టు కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో అమిత్‌ ‌షా ఈ మేరకు స్పందించారు.శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టులో మొత్తం 15 మంది ట్రస్టీలు ఉంటారు. అందులో దళిత వర్గానికి చెందిన ఒకరికి ఎల్లప్పుడూ ప్రాతినిధ్యం ఉంటుంది. సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు… అని అమిత్‌ ‌షా పేర్కొన్నారు. మొత్తం 67 ఎకరాల స్థలాన్ని ఆలయ ట్రస్టుకు ఇస్తామనీ.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు సభ్యులే తీసుకునేలా స్వేచ్ఛ ఉంటుందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply