Take a fresh look at your lifestyle.

విజయవాడ నగర పోలీస్‌ ‌కమిషనర్‌గా శ్రీనివాసులు

  • బాధ్యతలు చేపట్టిన బత్తిన
  • నేరాలను కఠినంగా అణచివేస్తామని ప్రకటన

‌విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరి ంచారు. ఇక్కడ సీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావును బదిలీ చేయడంతో అదనపు సీపీగా పనిచేస్తున్న శ్రీనివాసులుకు పూర్తిస్థాయి సీపీగా ఉద్యోగోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన సీపీ మాట్లాడుతూ…నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠన చర్యలు తీసుకొంటాం.. న్యాయం కోసం వచ్చే వారికి అండగా ఉంటాం..ఆన్‌లైన్‌ ‌మోసాలకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు. స్ఫెషల్‌ ‌బ్రాంచ్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. తనకు మరోసారి సీపీగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీపీగా పనిచేసిన అనుభవం, నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు. మరోసారి సీపీగా అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. స్పెషల్‌ ‌బ్రాంచ్‌ని బలోపేతం చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపా దం మోపుతామన్నారు.ఆన్‌లైన్‌ ‌మోసాలపై సైబర్‌ ‌సెల్‌ ‌ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కాగా గతంలో బత్తిన శ్రీనివాసులు 2013 మే నుంచి 2014 ఆగస్టు వరకు బెజవాడ సీపీగా పనిచేశారు. విజయవాడలో 23 నెలలుగా సీపీగా పనిచేశానని మాజీ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేశామన్నారు. కరోనా వైరస్‌ ‌నియంత్రణకు నగరంలో పటిష్ఠమైన చర్యలు తీసుకున్నా మన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకున్నామని వెల్లడించారు. సీపీగా విజయవాడలో పనిచేయడం మంచి అనుభవం, జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన శ్రీనివాసులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply