Take a fresh look at your lifestyle.

శ్రీనాథ్ రెడ్డి మృతి రాయలసీమ జర్నలిస్టులకు తీరని లోటు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ  మాజీ చైర్మన్  దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భౌతిక కాయానికి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను అమర్ పరామర్శించారు.

శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని రేపు తెల్లవారుజామున కడపలోని స్వగ్రామానికి తీసుకెళ్లనున్నారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి అని అమర్ తెలిపారు.జర్నలిస్టుల హక్కుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని, వ్యక్తిగతంగా వారితో తన అనుబంధం మరువలేనిది అని, శ్రీనాథ్ మృతి ముఖ్యంగా రాయలసీమ ప్రాంత జర్నలిస్టులకు తీరని లోటని అమర్ పేర్కొన్నట్లు సలహాదారు, జాతీయ మీడియా అంతర్రాష్ట్ర వ్యవహారాలు కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.  

Leave a Reply