Take a fresh look at your lifestyle.

11 నుంచి ఉ .6.30 నుంచి సా .7.30 వరకు శ్రీ వారి దర్శనం

  • 8,9తేదీల్లో టిటిడి ఉద్యోగులతో ట్రయల్‌
  • 10‌న స్థానిక భక్తులకు దర్శన భాగ్యం
  • రోజుకు 3వేలమందికి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ అవకాశం
  • అలిపిరి వద్ద 3వేల మందికి టిక్కెట్లు
  • అక్కడే వాహనాలకు థర్మల్‌ ‌స్క్రీనింగ్‌: ‌టిటిడి ఛైర్మన్‌ ‌వైవి వెల్లడి

శ్రీ‌వారి దర్శనానికి సాధారణ భక్తులను ఈ నెల 11నుంచి అనుమతిస్తామని టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. జూన్‌ 8, 9 ‌తేదీల్లో టీటీడీ ఉద్యోగులను, 10వ తేదీన స్థానికులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుందని వైవీ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకుని భక్తులు రావాలని, తిరుపతి అలిపిరి దగ్గర కూడా టికెట్లు బుక్‌ ‌చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు పైబడినవారికి దర్శనానికి అనుమతి లేదని వైవీ ప్రకటించారు. వీఐపీ దర్శనానికి కేవలం గంట మాత్రమే అనుమతి ఉంటుందని, శ్రీవారి మెట్టు మార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించమని టీటీడీ చైర్మన్‌ ‌స్పష్టం చేశారు. పుష్కరిణిలోకి భక్తులను అనుమతించమని, అలాగే అన్నదానం, కళ్యాణకట్టలోకి అనుమతి లేదన్నారు. అలిపిరి దగ్గర ప్రతి ఒక్కరికీ థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ ‌కారణంగా లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో తిరుమల శ్రీ వారి దర్శనాన్ని మార్చిలో నిలిపివేశారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు వెంకన్న దర్శనం నోచుకోలేదు. తాజాగా కేంద్రం ఇచ్చిన సడలింపుల్లో భాగంగా శ్రీ వారి దర్శనం కల్పించాలని ••ఆ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రోజు మూడువేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతినవ్వడం జరుగుతుందని, ఈ నెల 11వ తేదీ నుంచి శ్రీ వారి దర్శనం ఉంటుందన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే ఉంటుందని, దేశ వ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దర్శనానికి ఆన్‌ ‌లైన్‌ ‌ద్వారా రిజిస్టర్‌ ‌చేసుకోని వారు..నేరుగా తిరుపతికి వచ్చి చేసుకొనే అవకాశం కల్పించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడచుకుంటామని అన్నారు. కంటైన్‌ ‌మెంట్‌ ‌జోన్లు, రెడ్‌ ‌జోన్ల నుంచి వచ్చే భక్తులకు దర్శనానికి రావొద్దని సూచించారు.

Leave a Reply