Take a fresh look at your lifestyle.

బ్రహ్మత్సవాలకు ముస్తాబవుతున్న వెంకటేశ్వరాలయం

జాతర ఏర్పాటు పనుల్లో ఆలయ కమిటీ సభ్యులు – రేపు మొదలు మూడు రోజుల పాటు ఉత్సవాలు
ఇబ్రహీంపట్నం, మార్చి 24( ప్రజాతంత్ర విలేకరి)దాదాపు ఐదు వందల సంవత్సరాల కాలం నాటి ఆలయాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం  రాతితో ఏర్పాటు చేయబడి ఆలయ గర్భాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి  మూలవిరాట్‌ ‌ముడుమిటర్ల పోడవుతోపాటు  స్వామివారి కుడి భాగాన గోదాదేవి అమ్మవారి రెండుమిటర్ల, స్వామివారి ఎడమ భాగాన రామనుజులవారి  రాతి విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఈ ఆలయంలో 12 మంది ఆళ్వారులు, సాలగ్రామాలు, గర్భాలయం పైన పద్మవ్యూహం తో రాతితో చెక్కబడ్డాయి. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామానికి చెందిన అతి పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోదావరి నదితిరన ఉంది ఈ ఆలయం ప్రతి సవత్సరం వార్షికంగా హోలీకి మూడురోజుల ముందు నుండి. దేవాలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఉత్సవాలు జరుగుతాయి. కొన్ని సంవత్సరాలుగా  నిర్మల్‌ ‌జిల్లా ఖానాపూర్‌ ‌యజ్ఞర్చకులు  చక్రపాణి వాసుదేవాచార్యలు ,చక్రపాణి నరసింహమూర్తి చార్యుల చేతుల మిదుగా ఆలయంలో స్వామివారికి అభిషే కాలు, యజ్ఞము, ఆలయ బలిహరణం కళ్యాణ మహోత్స వ కార్యక్రమాలు ఆలయ అర్చకులు మంత్రరా జం శ్రీనివా స్‌ ‌చార్యులు, మంత్రరాజం జానకిరామచార్యుల చే నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండ పం,యజ్ఞ మండపము, కళ్యాణ మండపము, తులసి కోట, శివపార్వతుల ప్రతిరూపమైన  రావి,వేప,ఉసిరి చెట్లు భక్తుల పుజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయానికి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెంది ఉమ్మడి కరీంనగర్‌ ,ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాల నుండి బ్రహ్మోత్సవా లకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను  ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాలకు ఎర్పాట్లు పుర్తిచేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా  అన్ని ఏర్పాట్లు  సిద్ధంగా చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజువారీ కార్యక్రమాలు ఇలా 26వ తేదీ శుక్రవారం రోజున  ఉదయం ఎనిమిది గంటలకు ఆలయంలో గోదావరి జలాలతో అభిషేకాలు అనంతరం నిత్యవిధి ఆరాధనం,స్వస్తి వాచనం, దేవతామూ ర్తుల స్థాపనలు, అగ్ని ప్రతిష్ట, హోమము, ధ్వజారోహణం, గరుడపెల్లి, ఆలయ బలిహరణం  అనతరం నిథ్యవిది కార్యక్రమాలు 27వ తేదీ శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు ఆలయంలో గోదావరి జలాలతో అభిషేకాలు, స్వామి వారి ములవిరాఠ్‌ ‌కు పులభిషెకం అనంతరం నిత్యవిధి ఆరాధనం,స్వస్తి వాచనం, దేవతా మూర్తుల స్థాపనలు, హోమము, నిత్య పూర్ణాహుతి , బలిహరణం  అనంతరం ఆలయ నిత్యవిది కార్యక్రమాలు. 28వతేదీ అదివారం ఉదయం ఎనిమిది గంటలకు గోదా వరి జలలు, పంచామృత అభిషేకాలు స్వామి వారికీ  నిర్వహించిన అనంతరం, నిత్యస్వస్తి వచనం ,యజ్ఞము  పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి అమ్మవారు గ్రామ ప్రదక్షణ ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణ మండపం లో అలివేలు మంగమ్మ ,పద్మావతి శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వా మి వారికీ  అర్చకులు చేతుల మీదుగా కళ్యాణం జరిపీచబ డుతుంది.అనతరం స్వామివారి భక్తులకు గ్రామఅభివృద్ధి కమిటీ, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, రాత్రికి స్వామివారి రథము గ్రామంలో ఊరేగింపు ప్రదక్షిణ, అనంతరం అర్చకులకు సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుగనుంది.

Leave a Reply