Take a fresh look at your lifestyle.

అం‌తరంగికంగానే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

  • ఆన్‌లైన్‌ ‌ద్వారా సెక్టార్‌ ‌టికెట్లు కొన్నవారికి డబ్బులు వాపస్‌
  • ‌దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెల్లడి

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా శ్రీరామనవమి బ్రహోత్మవ్సాలను అంతరంగికంగానే నిర్వహించటం జరుగుతుందని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బి. శివాజీ తెలిపారు. ఆలయంలోనే కొద్ది మంది మతపర సిబ్బంది సమక్షంలో స్వామివారి కల్యాణం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతీ రోజు ఆలయంలో నిర్వహించే శ్రీ స్వామివారి నిత్య కల్యాణం అంతరాలయం అభిషేకమునకు సంబంధించిన టిక్కెట్లను 50శాతంగా పరిమితం చేస్తూ అట్టి సేవలను సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.

శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవము, పట్టాభిషేకములకు ఆన్‌లైన్‌ ‌ద్వారా సెక్టారు టికెట్లు బుక్‌ ‌చేసుకున్న భక్తులకు తిరిగి ఆ సొమ్మును వారి వెబ్‌సైట్‌ ‌నుండి ఆన్‌లైన్‌ ‌ద్వారా తిరిగి ఇవ్వబడునని తెలిపారు. ఈ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవాలు, తిరుకల్యాణము మరియు పట్టాభిషేకము ఆలయ ప్రాంగణంలో గల చిత్రకూట మండపంలో నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమానికి భక్తులకు ప్రవేశం లేదని తెలిపారు. కోవిడ్‌ 19 ‌వ్యాప్తి దృష్ట్యా భక్తులు గుమిగూడే అవకాశం ఉన్నందున శ్రీస్వామివారి తిరువీధి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

శ్రీస్వామివారి కల్యాణం కోసం ఆన్‌లైన్‌ ‌ద్వారా 5వేల రూపాయల ఉభయ దాతల టిక్కెట్లు బుక్‌ ‌చేసుకున్న భక్తులు కార్యాలయం నందు యంఆర్‌ ‌ద్వారా రుసుము చెల్లించిన భక్తులకు వారి అంగీకారంతో పరోక్షంగా కల్యాణం నందు వారి గోత్రనామాలు చదివి వస్త్రాలు మరియు తలంబ్రాలు పంపించటం జరుగుతుందని తెలిపారు. అలాగే నూతనంగా 1,116 రూపాయలు ఆన్‌లైన్‌ ‌ద్వారా చెల్లించిన భక్తులకు పరోక్షంగా గోత్రనామాలతో కల్యాణం చేయించి పోస్ట్ ‌మరియు కొరియర్‌ ‌ద్వారా ముత్యాలతో కల్యాణ తలంబ్రాలు మరియు ప్రసాదాలు పంపించటం జరుగుతుందని తెలిపారు.

5000 మరియు 1116 రూపాయలు చెల్లించిన భక్తులకు వారి గోత్రనామాలతో కల్యాణం జరిపించి 5 వేలు చెల్లించిన వారికి వస్త్రాలు మరియు ప్రసాదాలు, ఇవ్వబడునని తెలిపారు. 1116 చెల్లించిన వారికి తలంబ్రాలు ప్రసాదాలు పంపిచటం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆలయం నందు శ్రీస్వామివారి మూల వరుల దర్శనము యథావిధిగా కొనసాగుతున్నట్లు ఇఓ శివాజీ తెలిపారు.

Leave a Reply