Take a fresh look at your lifestyle.

13‌నుంచి ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు

విజయవాడ, ఏప్రిల్‌ 3 : ‌దుర్గగుడిలో ఈనెల 13 నుంచి 22వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలను ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పుష్పార్చనలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఉగాది రోజున అమ్మవారి వెండి రధోత్సవం ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 21న శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించి, 22న వసంత నవరాత్రోత్స వాలను ముగిస్తామని తెలిపారు.

Leave a Reply