Take a fresh look at your lifestyle.

నియంత్రణ లో వైరస్ వ్యాప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్ ను నియంత్రించటంకలో భారత్ మరో మైలురాయి దాటింది. మరిన్ని పరీక్షలు జరపాలన్న తన వ్యూహానికి అనుగుణంగా రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు జరుపుతూ వస్తోంది. గడిచిన 24 గంటలలో 10,66, 022 పరీక్షలు జరిగాయి. ఈ మొత్తం పరీక్షల సంఖ్య శనివారం నాటికి   13,06,57,808 కి చేరటంతో 13 కోట్ల మైలురాయి దాటినట్టయింది. ఆఖరి కోటి పరీక్షలు కేవలం పది రోజులలోనే జరగటం విశేషం. ఇలా రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు జరపటం వలన మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ కనీస స్థాయిలో సాగుతోంది. జాతీయ స్థాయిలో పాజిటివ్ కేసుల శాతం ఈ రోజుకు 6.93% కు చేరింది. నిన్నటి కేసులలో పాజిటివ్ శాతం  4.34%  లోపే నమోదైంది.  గత 24 గంటలలో 46,232 మంది కోవిడ్ పాజిటివ్ గా నమోదు కాగా పాజిటివ్ శాతం 4.34%, అమెరికన్, యూరోపియన్ దేశాలలో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ ఉండగా  భారత్ లొ అలాంటి పరిస్థితులు లేకపోవటం విశేషం.

 కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నట్టు తెలియటంతో అన్ని రాష్ట్రాలూ పరీక్షల సంఖ్య పెంచాలని కేంద్రం సూచించింది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి పది లక్షల మందిలో దేశ సగటు కంటే ఎక్కువగా పరీక్షలు జరిగాయి.

Leave a Reply