Take a fresh look at your lifestyle.

ఏజన్సీలో వలస నిరోధక చట్టాన్ని రూపొందించాలి జిఎస్పీ ధర్నాలో వక్తల డిమాండ్‌

‌భద్రాచలం (ప్రజాతంత్ర ప్రతినిధి):  ఏజన్సీలో వలస నిరోధకచట్టాన్ని రూపొందించాలని గోండ్వాన సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సోమవారం నాడు  జిఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ ధర్నాలో పొలిటికల్‌ ‌జేఏసి కన్వీనర్‌ ‌వాసం రామకృష్ణ మాట్లాడుతూ ఏజన్సీలో విచ్చలవిడిగా వలసలు వస్తున్నాయి,  వలసన• నిరోదించేందుకు వలన నిరోదక చట్టం రూపొందించవ లసిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే వలస నిరోదక చట్టాన్ని రసపొందించాలని డిమాండ్‌ ‌చేసారు. భద్రాచలం ఆదివాసీ సమితి అధ్యక్షులు పూనెం కృష్ణ దొర మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముర్ల ఎర్రయ్య రెడ్డి నివాస స్థలాన్ని వలస దారులు ఆక్రమించుట పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు.

ప్రభుత్వ జోక్యం చేసుకొని మాజీ ఎమ్మెల్యే ముర్ల ఎర్రయ్య రెడ్డి నివాసస్థలంలో ముర్లఎర్రయ్య స్మారక భవనాన్ని నిర్మాంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసారు. ఈ ధర్నాలో సీనియర్‌ ‌నాయకులు పడిగె సత్యనారాయణ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్‌ ‌రెడ్డి భద్రాచలం మార్కెట్‌ ‌కాంప్లెక్సు భవనాలను ప్రారంభించారని ముఖ్యమంత్రి ప్రారంభించిన షాపింగ్‌ ‌కాంప్లెక్సును వలస గిరిజనేతరులు ఎలా ఆక్రమించు కున్నారని ప్రశ్నించారు. ఈ ధర్నాలో మరో సీనియర్‌ ‌నాయకులు పాయం రమణయ్య మాట్లాడుతూ ఐటిడిఏ పథకాలను బినామీలను పేరిట వలస వాదులు అనుభవిస్తున్నారని బినామీలను నిరోదించేందుకు ఐటిడిఏ ఆధ్వర్యంలో మార్గ దర్శకాలను రూపొందించాలని ఐటిడిఏ అధికారులను కోరారు. గత ఐటిడిఏ పిఓ సురేష్‌ ‌కుమార్‌ ‌శంఖుస్థాపన చేసిన గిరిజన కమిటి హాలు భవన నిర్మాణాన్ని కొనసాగించాలని సీనియర్‌ ‌నాయకులు వెంకటేశ్వర్లు కోరారు. సీనియర్‌ ‌నాయకులు కల్లూరి కృష్ణ మాట్లాడుతూ జిఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమాల ద్వారానే జిఓ నెం. 3ని సాదించటం జరిగిందని జిఓ 3 ద్వారా లబ్దిపొందిన శాఖ అందరు జాతి ఉద్యమానికి అండగా నిలబడాలని కోరారు. జిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారయణ మాట్లాడుతూ ఏజన్సీలో వలస నిరోదక చట్టాన్ని పోరాటాలు కొనసాగిద్దామని అన్నారు.

జిఎస్పీ రాష్ట్ర కన్వీనర్‌ ‌సోందె వీరయ్య మాట్లాడుతూ ఏజన్సీలో రాజకీయ పార్టీలు గత 50 నెలలుగా ఆదివాసీలకు వంచనకు గురి చేస్తున్నారని ఆదివాసీలు రాజకీయ పార్టీలను నమ్మటం వల్లె పోలవరంలో మునిగిపోతున్నాయని అన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీలను నమ్మినంత కాలం గిరిజన చట్టాలు భూసమాది అవుతూనే ఉంటాయని అన్నారు. ఆదివాసీ చట్టాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని సుప్రింకోర్టు ఛీఫ్‌ ‌జస్టిస్‌ ఎన్‌వి. రమణ జూలై 2న లేఖ వ్రాసారని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిఎస్పీ నాయకులు బెండబోయిన శేఖర్‌, ‌సంతోష్‌ ‌కుమార్‌, ‌పోడియం సమ్మయ్య, సన్యాసి, ముక్తి జనార్ధన్‌ ‌రావు, సురేష్‌, ‌జిటిఎష్‌ ‌నాయకులు రమణయ్య, కల్లూరి కృష్ణ, వెంకటేశ్వర్లు సత్యనారాణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply