Take a fresh look at your lifestyle.

తెలంగాణ గులాబీ – భారత జాతి శిరోమణి

‘భారత మహిళల విమోచనం, వలసపాలన విముక్తి, హిందు ముస్లింల ఐక్యత, సామరస్యాల లక్ష్యాల సాధన కోసం జీవితాంతం పోరాడారు. దురాచారాలు, మూఢనమ్మకాలు, ఆంక్షలతో దైన్యంగా బతుకుతున్న భారత స్త్రీ జనోద్ధరణ కోసం అనేక సభలను, ప్రాతినిధ్యాలను, ఉద్యమాలను నిర్వహించారు. దారుణ వివక్షకు గురవుతున్న హిందూ వితంతువుల కోసం పునరావాస కేంద్రాలను నెలకొల్పారు. స్త్రీల, విద్య, రాజకీయ హక్కుల కొరకు 1917లో అనీబిసెంట్‌తో కల్సి ‘‘ఉమెన్స్ ఇం‌డియా అసోసియేష్‌న్‌’’‌ను స్థాపించారు. దేశమంతా పర్యటిస్తూ అద్భుతమైన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రత్యేకించి మహిళలను స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం చేయించారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పర్యటించి స్వాతంత్య్ర పోరాటానికి మద్దతును కూడగట్టారు. దేశ, విదేశాలలో ఎక్కడ ప్రసంగించినా తాను తెలంగాణ బిడ్డగా ప్రకటించుకున్నారు.తెలంగాణ లౌకిక జీవన విధానంపై సబ్బండ వర్ణాల జనజీవన రీతిపై, కష్ట జీవులపై, స్త్రీ విముక్తికై కలం పట్టి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన జనకవయిత్రిగా, స్వాతంత్య్ర పోరాట అగ్రనేతగా వెలుగొందిన భారతకోకిల సరోజినీదేవి 2, మార్చి 1949లో అమరులయ్యారు.

‘‘సమ్మోహన శక్తిగల ధీశాలి, ధైర్యశక్తి గల సౌజన్యమూర్తి, సాంస్క•తిక వైవిధ్యంగల సృజనశీలి, చిత్తశుద్ధి, హాస్యచతురత కలబోసిన మహిళామణి’’.. 1925 కాన్పూర్‌ ‌భారత జాతీయ కాంగ్రెస్‌ ‌సమావేశంలో అధ్యక్షురాలిగా ఎంపికైన తర్వాత ప్రఖ్యాత బ్రిటీష్‌ ‌రచయిత అల్డెస్‌ ‌హక్సెరే సరోజనీ నాయుడును ఇంటర్వ్యూ చేసి ఆమె వ్యక్తిత్వాన్ని పై మాటలలో ఆవిష్కరించారు. అధ్యక్షహోదాలో ఆమె ప్రసంగం చేస్తూ ‘పీడిత ప్రజల విమోచనానికి, జాతి, మత, కుల పరమైన భేదాలు ఇనుప సంకెళ్ళని, భారతీయులంతా ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేకుండా త్యాగం చేస్తేనే, భారతజాతి బానిసత్వం నుండి విమోచనం పొందగలదని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని, బానిసభావంతో తరతరాలు మ్రగ్గిపోతూ బ్రతికేకంటే త్యాగంతో ఒక తరం అంతరించినా కూడా, భావితరాలకు స్వేచ్ఛను, చక్కని భవిష్యత్‌ను ప్రసాదించగలం’’ అని ప్రకటించారు. దేశంపై గల ప్రేమకు, స్వాతంత్య్ర పిపాసకు భారత స్త్రీకి ప్రతీకగా, స్వాతంత్రోద్యమంలో ప్రథమశ్రేణి నాయకురాలిగా చిరస్మరణీయ, అసమాన పోరాటాలు నిర్వహించిన సరోజినీ దేవి తెలంగాణ మాగాణ సౌధం హైద్రాబాద్‌లో 1879న ఫిబ్రవరి 13, జన్మించారు.

మార్చ్ 2, ‌సరోజనిదేవి వర్థంతి
ఇంగ్లండ్‌ ‌విద్యావేత్తల సూచన మేరకు నైజాం రాజ్య ప్రధాని సాలర్‌జంగ్‌ ‌లండన్‌లో ఉన్నత విద్యను చదివి శాస్త్రవేత్తగా పని చేస్తున్న అఘోరనాథ్‌ ‌ఛటోపాధ్యాయను నిజాం కళాశాల ప్రన్సిపాల్‌గా నియమించాడు. జ్ఞానంలో, బహుభాషల ప్రావీణ్యంలో, అనేక అభినివేశాలలో తనతో సమఉజ్జీగా ఉన్న వరదాదేవిని అఘోరనాథ్‌ ‌జీవన సహచారిగా ఎంచుకున్నాడు. ఇలాంటి ఉత్క•ష్ణ మేధో జంటకు పుట్టిన ప్రథమ సంతానం సరోజినీదేవి. సింగరేణి బొగ్గుగనుల వరకు రైల్వే లైను నిర్మాణ కాంట్రాక్ట్ ఒప్పందాలలో జరిగిన అవినీతిని ఎండగట్టి, నిరాశ్రయులవుతున్న ప్రజల పునరావాసం కోసం ఉద్యమాలను నిర్మించి నిజాం రాజును ధిక్కరించిన అఘోరనాథ్‌ ‌వారసత్వాన్ని వారి బిడ్డలు సరోజినీదేవి, హరేంద్రనాథ్‌, ‌వీరేంద్రనాథ్‌లు కొనసాగించి జాతియోద్యమ నిర్మాణంలో, పీడితప్రజల విముక్తి ఉద్యమాలలో చారిత్రక పాత్రను పోషించారు. సరోజినీదేవి బిడ్డలు జయసూర్య, పద్మజలు తెలంగాణ ప్రజల తండ్లాటను అర్ధం చేసుకొని, వారి హక్కుల పరిరక్షణకు ధీరోదాత్తమైన కృషి చేశారు. తల్లి వరదాదేవి నాంపల్లిలో స్థాపించిన తొలి బాలికా పాఠశాలలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న సరోజిని తన 12వ ఏట మద్రాస్‌లో మెట్రిక్యులేషన్‌ ‌పట్టాను పొందారు. 13వ ఏట హైద్రాబాద్‌ ‌నగర సంస్క•తికి హృదయమైన చుడి బజార్‌ ( ) ‌పై సానెట్లు రాసి భారతీయ ఆంగ్ల కవితా సౌధ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. మరొక కవితలో నగరాన్ని వర్ణిస్తూ ‘‘దివ్యమైన దేవతలు సృష్టించిన రాణిలా రాత్రి నగర వంతెనల మీదుగా వీధుల్లో సంచారం చేస్తుంది. కంచు తాళాల, మేళాల, వాహనాల ఊరేగింపు మధ్య ప్రియతమ కోసం ఆలపించిన ప్రేమగీతాలు చార్‌‘‘‌మినార్‌’’‌ల గాలి అలల మీద ప్రయాణించి ప్రజలను పారవశ్యం చెందిస్తున్నాయి’’ అని రాశారు. ఇలా కిశోర వయస్సులోనే మూసీనదిపై రాసిన లేడీ ఆఫ్‌ ‌లేక్‌, ‌పర్షియన్‌ ‌భాషలో రాసిన ‘‘మెహర్‌ ‌మునీర్‌’’ ‌నాటకంలో రాసిన సరోజినీదేవి ప్రతిభకు ముగ్ధుడైన నిజాం ఆమె ఉన్నతవిద్యను ఇంగ్లండ్‌లో చదవడానికి ఉపకారవేతనాన్ని అందించాడు. కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు ఆర్థర్‌ ‌సైమన్‌, ఎడ్మండ్‌ ‌గాస్‌ ‌వంటి కవులతో పరిచయం, వారి ప్రోత్సాహంతో సాగిన సరోజిని సాహిత్య సృజన అంతర్జాతీయ సాహిత్య లోకాన్ని ఆకట్టుకున్నది. భారతదేశ సహజ సౌందర్యం, ప్రేమ, సౌభ్రాతృత్వం, జీవన మాధుర్యం, మతాల సామరస్య సమేళనం, సంస్క•తిని సుసంపన్నం చేసిన బహుళత్వ కలయిక వాటిని ఇతివృత్తంగా ‘బంగారు వాకిలి’, ‘కాల విహంగం’,‘విరిగిన రెక్కలు’ వంటి ప్రఖ్యాత రచనలు చేశారు. తాను రాసిన పుస్తకాలు అమ్మినప్పుడు వచ్చిన డబ్బును రెండవ ప్రపంచయుద్ధంలోని క్షతగాత్రుల సేవలకు అందించారు.

19వ ఏట తను ప్రేమించిన డా.ముత్యాల గోవిందరాజులునాయుడిని వివాహమాడారు. వర్ణాంతర, కులాంతర వివాహాలను నిషేధించిన హిందూసమాజ విలువలను ధిక్కరించి అభ్యుదయవాదులైన ఇరుపక్షాల సమ్మతితో కందుకూరి వీరేశలింగం సహకారంతో బ్రహ్మసమాజ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట 1909లో మూసీనది వరదల వలన ఇబ్బందులు పడ్డ ప్రజలకు సహాయక శిబిరాలు నిర్వహించారు. హైద్రాబాద్‌ ‌కేంద్రంగా సామాజిక సేవను, సాహిత్య సృజనను ప్రారంభించిన సరోజినీ ప్రతిభను, తెలివితేటలను గుర్తించిన జాతియోద్యమ సుప్రసిద్ధ నేత గోపాలకృష్ణ గోఖలే ఆమెను దేశం కోసం పని చేయమని కోరాడు. ఈ పిలుపును అందుకున్న ఆమె ‘భారత మహిళల విమోచనం, వలసపాలన విముక్తి, హిందు ముస్లింల ఐక్యత, సామరస్యాల లక్ష్యాల సాధన కోసం జీవితాంతం పోరాడారు. దురాచారాలు, మూఢనమ్మకాలు, ఆంక్షలతో దైన్యంగా బతుకుతున్న భారత స్త్రీ జనోద్ధరణ కోసం అనేక సభలను, ప్రాతినిధ్యాలను, ఉద్యమాలను నిర్వహించారు. దారుణ వివక్షకు గురవుతున్న హిందూ వితంతువుల కోసం పునరావాస కేంద్రాలను నెలకొల్పారు. స్త్రీల, విద్య, రాజకీయ హక్కుల కొరకు 1917లో అనీబిసెంట్‌తో కల్సి ‘‘ఉమెన్స్ ఇం‌డియా అసోసియేష్‌న్‌’’‌ను స్థాపించారు. దేశమంతా పర్యటిస్తూ అద్భుతమైన ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ ప్రత్యేకించి మహిళలను స్వాతంత్య్రపోరాటంలో భాగస్వామ్యం చేయించారు. అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాలు పర్యటించి స్వాతంత్య్ర పోరాటానికి మద్దతును కూడగట్టారు. దేశ, విదేశాలలో ఎక్కడ ప్రసంగించినా తాను తెలంగాణ బిడ్డగా ప్రకటించుకున్నారు. 1921 సహాయనిరాకరణ, 1931 శాసనోల్లంఘన, 1942 క్విట్‌ ఇం‌డియా ఉద్యమాలలో గాంధీజీ, నెహ్రూ, ఆజాద్‌లతో అగ్రభాగాన నడిచింది. 1931 రెండవ రౌండ్‌ ‌టే•బుల్‌ ‌సమావేశంలో గాంధీతో భారత మహిళా ప్రతినిధిగా పాల్గొన్నారు. జాతీయోద్యమ అగ్రనాయకులను ప్రభుత్వం జైలులో నిర్బంధించినప్పుడు ఉద్యమ వేడిని చల్లారన్వికుండా, నాయకత్వం వహిస్తూ పోరాటాన్ని కొనసాగించారు. సరోజిని సోదరుడు వీరేంద్రనాథ్‌ ‌లాలాలజపతిరాయ్‌ ‌స్ఫూర్తితో బ్రిటీష్‌ ‌సామ్రాజ్యవాదంపై విప్లవాత్మక సాయుధ•పోరాటాన్ని నిర్వహించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ భారత విప్లవకారులకు ఆయుధాలు, ధన సహయాన్ని అందిస్తూ ఉండేవారు. భారతస్వాతంత్య్ర పోరుకు సహకరిస్తున్న అమెరికన్‌ – ‌మెక్సికన్‌ ‌మహిళ అగ్నెస్‌ ‌స్మెడ్లిని ఆయన వివాహమాడాడు. 1947లో సరోజిని ఉత్తరప్రదేశ్‌ ‌గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజ్యాంగ పరిషత్‌కు బీహర్‌నుంచి ఎంపికై ప్రాథమిక హక్కుల, ప్రొవిన్షియల్‌ ‌కమిటి సభ్యురాలిగా ఉన్నారు. బుద్ధుడి గుణాలైన ప్రేమ, త్యాగం, ప్రజలను రాజ్యంగం ప్రతిఫలించాలని, శాంతి, స్వేచ్ఛ, విశ్వవేదాలతో మానవాళి చరిత్రలో భారత్‌ ‌మరోసారి జ్ఞానదీపాన్ని వెలిగించి లోకానికి వెలుగు చూపించాలని, ఈ దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న రాజేంద్ర ప్రసాద్‌, అం‌బేద్కర్‌లకు కృతజ్ఞతలను తెలిపారు. మన జాతీయపతాకం ప్రపంచానికి తలమానికంగా ఉందని, ఇది వివక్షత చూపించదు, రాజైనా, రైతైనా సమానమే. దేశమాత, దేశమాత బిడ్డలంతా పతాకానికి వందనం చేయాలని కోరారు.

జాతీయోద్యమ చరిత్ర నిర్మాణంలో విశిష్ట పాత్రను పోషించిన సరోజని కుటుంబం నిజాం, దొరల నిరంకుశ పాలనకు, దీనికి దన్నుగా ఉన్న బ్రిటీష్‌ ‌సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు కొనసాగించిన వీరోచిత పోరాటాలకు అండదండలను అందించారు. మట్టిమనుషులు ప్రముఖ పాత్ర నిర్యహిస్తున్న సాయుధ పోరాటంపై సరోజని చిన్న తమ్ముడు హరేంద్రనాథ్‌ ‘‘‌టేల్స్ ఆఫ్‌ ‌తెలంగాణ’’ గీతాలను రాసి ప్రపంచానికి చాటారు. దీనిని అరుద్ర తెలంగాణ విప్లవగీతాలుగా తెలుగులో అనువాదం చేశారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల గురించి ‘హే సాధారణ గ్రామమూర్తులు, ఇతిహాసం సంపుటాల్లో స్పందింపుము, జ్వలింపుము, ప్రసరింపుము’ అని రాశారు. కమ్యూనిస్ట్ ‌పార్టీ తరపున 1951 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుండి ఎన్నికై పీడిత ప్రజల తరపున పనిచేశారు. సరోజిని కొడుకు డాక్టర్‌ ‌జయసూర్య, బిడ్డ పద్మజలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వరుస్వామిలతో కలిసి తెలంగాణ పౌర హక్కుల ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో ఆకునేరు, మాచిరెడ్డిపల్లిలో పోలీసుల ఆకృత్యాలపై నిజనిర్ధారణ జరిపి ప్రపంచానికి తెలియజేశారు. సైనిక చర్య సందర్భంగా యూనియన్‌ ‌సైన్యాలు రజాకార్ల పేరుతో, కమ్యూనిస్టుల పేరుతో నలభైవేలకు పైగా అమాయక ముస్లింలను, సాధారణ రైతులను భారతసైన్యం చంపిందని సాక్ష్యాధారాలతో నెహ్రూ ప్రభుత్వానికి, అంతర్జాతీయ హక్కుల సంస్థలకు నివేదికలను అందించారు.

నెహ్రూ విచారణకు ఆదేశించినా కమ్యూనిస్ట్ ‌వ్యతిరేకతను కల్గి ఉన్న పటేల్‌ ‌దానిని నిలిపివేశారు. నిజాంను, యూనియన్‌ ‌సైన్యాలను తన గెరిల్లా దాడులతో ముప్పు తిప్పలు పెట్టిన, కడవెండి విప్లవ సింహం, నల్లా నర్సింహతో మరొక పదిమందికి ప్రభుత్వం ఉరిశిక్షలు విధించింది. యూనియన్‌ ‌సైనిక జనరల్‌ ‌మేజర్‌ ‌చౌదరికి నల్లా నర్సింహను పరిచయం చేస్తున్నప్పుడు ‘తెలంగాణ టైగర్‌’ అని నల్లా నర్సింహను సంబోధించారు. ఈ నేపథ్యంలో జయసూర్య ఇంగ్లాండ్‌ ‌నుంచి బారిస్టర్‌ ‌పిటిసు, బొంబాయి నుండి డినియల్‌ ‌బతీఫ్‌ల పిలిపించి వాదింపచేసి ఉరిశిక్షలను రద్దు చేయించారు. నిర్బంధించబడిన వేలాది తెలంగాణ రైతు బిడ్డలను విముక్తి చేయించారు. కమ్యూనిస్ట్ ‌పార్టీపై నిషేధం, నిర్బంధం కొనసాగుతుండడంతో జయసూర్య పీపుల్స్ ‌డెమోక్రటిక్‌ ‌బ్రిటీష్‌ను ఏర్పాటు చేసి చెయ్యిగుర్తుతో తెలంగాణలో 90 స్థానాల్లో 48 స్థానాలను గెలిపించుకున్నారు. అబిడ్స్‌లోని తమ నివాస గృహం ‘గోల్డెన్‌ ‌త్రెషోల్డ్’‌ని తెలంగాణ సాహిత్య, సాంస్క•తిక కళాకేంద్రంగా మార్చారు. తరువాత ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశోదన కేంద్రంగా మారింది. తెలంగాణ లౌకిక జీవన విధానంపై సబ్బండ వర్ణాల జనజీవన రీతిపై, కష్ట జీవులపై, స్త్రీ విముక్తికై కలం పట్టి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన జనకవయిత్రిగా, స్వాతంత్య్ర పోరాట అగ్రనేతగా వెలుగొందిన భారతకోకిల సరోజినీదేవి 2, మార్చి 1949లో అమరులయ్యారు. ఆమె జయంతి, వర్ధంతులను స్ఫూర్తిదాయకంగా నిర్వహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. తెలంగాణ సామాజిక, రాజకీయ, సాంస్క•తిక పరిణామాలకు అమె కుటుంబం చేసిన సేవలపై మోనోగ్రాఫ్‌ను ప్రచురించి పాఠ్యాంశాలుగా చేర్చాలి. సరోజినిదేవి జీవితాంతం పోరాడి, ప్రవచించి, ఆచరించిన సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక, బహుళత్వ విలువలకు విఘాతం కల్గిస్తున్న మూకశక్తులను నిలువరించడంలో తెలంగాణ అగ్రగామిగా ఉండాలి. అది భారత్‌కు మార్గం అవ్వాలి. అదే అమ్మ.. తెలంగాణ గులాబి రెమ్మ – భారత శిరోమణి సరోజినిదేవి నాయుడికి ఇచ్చే నిజమైన నివాళి.

అస్నాల శ్రీనివాస్‌ ‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం.

 

Leave A Reply

Your email address will not be published.