
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్ : నిజామాబాద్‌లో ప్రాంతీయ సుగంధద్రవ్యాల బోర్డును ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన ప్రకటనచేశారు. దీనిని ప్రాంతీయ సుగంధ ద్రవ్యాల డైరక్టరేట్‌గా గా వ్యవహరిస్తారని చెప్పారు. ఐఏఎస్ హోదాగల అధికారి ఇక్కడ డైరక్టర్‌గా ఉంటారు. తెలంగాణలో ఈ బోర్డు ఏర్పాటువల్ల ఆదిలాబాద్,వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులకు చాలా ఉపయోగకరం కాగలదని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బోర్డు దోహదకారి కాగలదని కేంద్ర వాణిజ్యమంత్రి ప్రకటించారు.పదిహేనురోజుల్లో బోర్డు కార్యాచరణను ప్రారంభించనున్నదని కేంద్ర వాణిజ్యమంత్రి పేర్కొన్నారు. కాగా 2014నుంచి పసుపుబోర్డు ఒక రాజకీయ నినామైంది. కేంద్రంలో ఏ ప్రబుత్వం ఉన్నా, మెడలువంచి పసుపు బోర్డు తీసుకొస్తానని 2014 అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ నిజామాబాద్‌లో జరిగిన పలుసభలలో వాగ్దానం చేశారు. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ నినాదం రాజకీయ పార్టీలకు ఉపయోగపడింది. పార్లమంటు ఎన్నికల్లో 200 మందికి పైగా పసుపురైతులు పోటీచేశారు. ఢిల్లీలో కూడా ఆందోళనలు చేశారు. నిజామాబాద్ రైతులు ఆందోళనలకు ఆవేదనలకు సమాధానం లభించింది. కేంద్రం సుగంధద్రవ్యాల బోర్డు ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. నిజామాబాద్‌యరైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమంతి సుగంధద్రవ్యాల బోర్డు అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. నిజామాబాద్ పసుపునకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్నది. అంతర్జాతీయ కొనుగోలు దారులు గ్రూప్‌గా ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు,మిర్చి ధరలను నియంత్రిస్తున్నారు. ఈ బోర్డు ఏర్పాటుతో రైతుల కష్టాలు తొలగిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పసుపు దిగుబడి పెంచేందుకు, కావాల్సిన సాంకేతిక సహకారం, ఆధునికసాగువిధానాలను రైతులక దీనిద్వారా తెలియచేస్తారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరలతో సమన్వయం చేసుకొంటూ రైతులకు ఎక్కువ లాభం చేకూర్చేవిధంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తెస్తారు.వరంగల్ మార్కెట్‌లో తేజరకం మిర్చికి మంచి ధర వచ్చింది. రైతులకు ఎక్కువధర రెండురోజులు మాత్రమే లభించింది. వెంటనే అంతర్జాతీయ మార్కెట్ కొనుగోలుదారులు కలిసిపోయి ధరలను నియంత్రించారు. ఈ పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూరేవిధంగా ఈ బోర్డు ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నది. ఈ సెంటర్ ఏర్పాటుతో పసుపు బోర్డు కంటే మించి రైతులకు లాభం జరుగనున్నదని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.. ఈ సెంటర్ తో పసుపు, మిరప పంటల రైతులకు ప్రయోజనం జరుగనున్నది. .పసుపు,మిర్చితోపాటు మిగతా సుగంధద్రవ్యాల ధరలను రైతులకు అనుగుణంగా మార్చడం, రైతులకు విత్తనాలను అందుబాటులో పెట్టడం,నిరంతరం రైతులను సమన్వయం చేయడం వంటి పనులను ఈసెంటర్ చేయనున్నది. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభించే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలియచేసింది. . ఇప్పటివరకు కేరళలో స్పైసెస్ బోర్డు ఆఫీస్ ఉండేది. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర విషయాలను రీజినల్ బోర్డు చూసుకోనుంది. పసుపుకు మద్దతు ధర కోసం నిజామాబాద్ రైతులు ఎన్నాళ్లుగానో పోరాటం చేస్తున్నారు. రీజినల్ బోర్డు ఎక్స్ టెన్షన్ సెంటర్ ను ఐఏఎస్ అధికారులు నేరుగా పర్యవేక్షిస్తారు. పసుపు పంటకు మద్దతు ధర పెంచేలా.. గడిచిన మూడునాలుగేళ్లపాటు వాణిజ్య శాఖ కసరత్తు చేస్తున్నది. రైతుల పోరాటానికి ఇది ఫలితం