Take a fresh look at your lifestyle.

ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల పట్టాలు
సీసీఎల్‌ఏకు కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌జీవో నంబర్‌ 58, 59 ‌కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పక్రియ వేగవంతం చేయాలని కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సీసీఎల్‌ఏను సబ్‌ ‌కమిటీ ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పంపిణీకి సిద్దం చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లో పక్రియను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

శుక్రవారం బీఆర్కే భవన్‌లో మంత్రులు హరీష్‌ ‌రావు, కేటీఆర్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌, ‌రావు శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీలో, సిఎస్‌ ‌శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ ‌మిట్టల్‌, ఇతర ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్‌, ‌పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై సబ్‌ ‌కమిటీ చర్చించింది. జిల్లా కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, పక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న పేదలకు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని పేర్కొన్నది. ఆ దిశగా అందరూ కృషి చేసి, అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం చేకూర్చాలని అభిప్రాయపడింది.

Leave a Reply