Take a fresh look at your lifestyle.

గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌పనుల వేగం పెంచండి

సిద్ధిపేట జిల్లాలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌పనులలో వేగం పెంచాలని ఇరిగేషన్‌ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి అధ్యక్షతన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కలిసి గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌పనులపై సమీక్షించారు. ముందుగా గౌరవెల్లి రిజర్వాయర్‌ ‌పనుల పురోగతిని ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ‌వివరించి పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో రిజర్వాయర్‌ ‌పనులు పూర్తిచేసి హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ, సిద్ధిపేట జిల్లా రైతుల ఆకాంక్షలు తీర్చాలని మంత్రిని కోరారు.

ఈ మేరకు రిజర్వాయర్‌ ‌బండ్‌ ‌పనులు, ప్రధాన కాలువ, పంప్‌ ‌హౌస్‌, ‌సర్జిపూల్‌, ‌టన్నెల్‌, ‌టన్నెల్‌ ‌లైనింగ్‌ ‌పనులు, గ్రావిటీ కెనాల్‌ ‌లైనింగ్‌, ‌ప్రధాన కాలువ, కాలువ భూసేకరణ తదితర అంశాలపై ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, ఇరిగేషన్‌ ‌సీఈ, ఎస్‌ఈలతో పురోగతి పై చర్చించి, ఇరిగేషన్‌ అధికారులు, ఏజెన్సీలను మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బండ్‌ ‌పనులతో పాటు భూ సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే వానా కాలానికి నీళ్లు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

11.8కిలో మీటర్ల మేర టన్నెల్‌ ‌లైనింగ్‌ ‌పూర్తి అయినట్లు, అదే విధంగా 6.9కిలో మీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ ‌లైన్‌ ‌పూర్తి అయినట్లు.. మొత్తం 18.7 కిలోమీటర్ల మేర టన్నెల్‌, ‌గ్రావిటీ కెనాల్‌ ‌లైనింగ్‌ ‌పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు చేసే అంశంపై ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డితో చర్చించారు. సమీక్షలో హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రా రెడ్డి, ఇరిగేషన్‌ ‌సీఈ, ఎస్‌ఈ, ఈఈలు, ఇరిగేషన్‌ అధికారులు, ఆయా మండల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply