నేషనల్ హైవే-161 పనులు వేగవతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లాలో ఉన్న నాలుగు జాతీయ రహదారులపై విధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేషనల్ హైవే161-దీ నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ హెచ్-65 పై భెల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించాలని నిర్మాణ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాలో 1447 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు.
వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలో 116 రైతు వేదికలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో నియంత్రిత సాగు వంద శాతం విజయవంతమైందని మంత్రి గారు తెలిపారు. కరోనా వల్ల రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి అత్యవసరమైతెనే బయటికి రావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, ఎమ్మెల్సీ ఫరీరుద్దీన్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మానిక్ రావు, భూపాల్ రెడ్డి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.