- వచ్చే ఎన్నికలు లక్ష్యంగా టీమ్‌ను పటిష్టం చేసే పనిలో మోదీ
- తెలంగాణ నుంచి కొత్తగా ఒకరిద్దరికి చోటు అంటూ వార్తలు
న్యూదిల్లీ,జనవరి9 : కేంద్రమంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వరుసగా జాతీయ డియాలో కూడా దీనిపై ప్రచారం సాగుతోంది. 9 రాష్టాల్ర అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికలు, మంత్రుల పనితీరు ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు ఆధారంగా కొందరిని తొలగించి మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 15 నుంచి 25వ తేదీ మధ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, రానున్న అసెంబ్లీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్?లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ మోడీ మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
కొందరు మంత్రులు, పా?ర్టీ ఆఫీస్ బేరర్ల పనితీరు ఆశాజనకంగా లేదని భావిస్తున్న ప్రధాని కేబినెట్ మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. •జరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఈ పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మినిస్టర్లు తమ పదవులు ఉంటాయా ఊడతాయా అన్న ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు 2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త కేబినెట్ కూర్పు ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కర్నాటక, చత్తీస్ ఘడ్, త్రిపుర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర 9 రాష్టాల్లో్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్టాల్రకు కొత్త మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో మరో ఒకట్రెండు మంత్రి పదవులు కట్టబెట్టే సూచనలు ఉన్నాయి. నితీరు సరిగా లేని మినిస్టర్లను పక్కనబెట్టి.. వివిధ రాష్టాల్లో్ర స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న వారికి సైతం కేబినెట్లో చోటు కల్పించాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పునర్వ్యవస్థీకరణ కావడంతో మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఆశలు పెట్టుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్టాన్రికి చెందిన ఇద్దరు ఎంపీలకు మంత్రులుగా ప్రమోషన్ వచ్చే అవకాశముంది. దీంతో పాటు మహిళా మంత్రుల సంఖ్యను పెంచాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం.