Take a fresh look at your lifestyle.

నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళికకై, ఖచ్చితమైన అవగాహన అవశ్యకం

“మొదటగా ప్రణాళిక రూపొందించుకునేప్పుడు మనం ఏవి అవసరాలు, ఏవి సౌకర్యాలు, ఏవి విలాసాలు అనే అంశాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిందే. అవసరాలు అనేవి ఆదాయస్థాయితో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు తప్పని సరిఖర్చే. సౌకర్యాలు అనేవి తరగతిని బట్టి మారుతాయి. కారు ధనవంతులకు సౌకర్యం అయితే దిగువ మధ్య తరగతి వారికి విలాసమే అని చెప్పవచ్చు. ఇలామన స్థాయిని బట్టి ఏది అవసరం, ఏది విలాసమో గుర్తించాలి.”

భవిష్యత్తులో ఏ లక్ష్యమైన సాధిం చాలంటే అందుకు తగ్గ నిర్దిష్ట ప్రణాళిక తప్పనిసరి. భవిష్యత్తు పూర్తిగా రిస్క్ ‌మరియు అనిశ్చితితో కూడుకున్నది, ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఊహిం చలేము. కొన్ని ప్రమాదాలు ఆర్థిక స్థితి గతులను తారు మారు చేస్తే మరికొన్ని సాంఘీక లేదా ఆరోగ్యపరమైన సమస్యలను సృష్టిస్తాయి. కొరోనా లాంటి ప్రళయాలు ఆర్థిక మరియు సాంఘీక పరిస్థితులను ఏకకాలంలో తలక్రిందులు చేయడం మనమంతా చూస్తుందే. అందుకే ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కొంతవరకు పరిస్థితులకు ఎదురొడ్డి నిలువాలంటే ఒక ప్రణాళిక ఉండాల్సిందే అనేది అక్షర సత్యం.

మొదటగా ప్రణాళిక రూపొందించుకునేప్పుడు మనం ఏవి అవసరాలు, ఏవి సౌకర్యాలు, ఏవి విలాసాలు అనే అంశాలపై ఖచ్చితమైన అవగాహన ఉండాల్సిందే. అవసరాలు అనేవి ఆదాయస్థాయితో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు తప్పని సరిఖర్చే. సౌకర్యాలు అనేవి తరగతిని బట్టి మారుతాయి. కారు ధనవంతులకు సౌకర్యం అయితే దిగువ మధ్య తరగతి వారికి విలాసమే అని చెప్పవచ్చు. ఇలామన స్థాయిని బట్టి ఏది అవసరం, ఏది విలాసమో గుర్తించాలి. ప్రణాళిక తయారుచేసుకునేప్పుడు మన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చుల• •టాయింపు జరగాలి భవిష్యత్తులో రాబోయే ఆదాయంను ఎట్టి పరిస్థితిలో పరిగణలోనికి తీసుకోకూడదు, కాని భవిష్యత్తులో ఎదురయ్యే ఖర్చులకు మాత్రం మనం తగిన ఏర్పాటు చేసుకోవాలని అకౌంటింగ్‌ ‌సంప్రదాయమైన కాస్ట్ ఆఫ్‌ ‌కన్సర్వేటి జం సూచిస్తుంది. అంటే భవిష్యత్తులో లాభాలు వస్తాయని ఇప్పుడున్న సంపదను ఖర్చు పెట్టకూడదు, కానీ భవిష్యత్తులో నష్టాలు వస్తాయని ముందే ఉహించి ఇప్పటి నుంచి కొం• •మొత్తాన్ని నిధులు మరియు ఏర్పాట్ల రూపంలో ప్రక్కకు ఉంచడం ద్వారా కొరోనా లాంటి నష్టాలను కొంత వరకు తగ్గించ వచ్చు.

ప్రణాళిక కంటే ముందు మనం కనీసం 6 నెలలకు సంబంధించిన ఖర్చులకు సరిపడే ఆదాయాన్ని / జీతాన్ని ఎప్పటికి మన ఖాతాలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడున్న కోవిడ్‌ ‌పరిస్థితులను చూస్తే 6 నెలలు కాదు 12 నెలల జీతాన్ని అట్టి పెట్టుకోవాల్సిందేనని అర్థమవుతుంది. ఇంత మొత్తాన్ని ప్రక్కకు పెట్టిన తరువాత వైద్య అవసరాలకు సంబంధించి ఒక ఆలోచన తప్పనిసరి. ఎందుకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాజంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పోటీ పడుతున్నాయి.ఈ పరుగు పందెంలో ఒక్కోసారి వైద్య ఖర్చులు ఆర్థిక లక్ష్యాలను క్రింద పడేసే ప్రమాదం కూడా ఉంది. కావున కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా ఒక ఆరోగ్య భీమా కలిగివుండేలా చూసుకోవాలి.

ప్రణాళికలో అనవసర ఖర్చులకు స్థానం లేకుండ జాగ్రత్త పడాలి. ఉదాహరణకు బట్టల షాప్‌లో డిస్కౌంట్‌ ఎక్కువ ఉందని అవసరం లేకున్న షాపింగ్‌ ‌చేయడం లాంటివి మానుకోవాలి. ఈ మధ్య చాలా బ్యాంకులు క్రెడిట్‌ ‌కార్డ్‌ను ఆఫర్‌ ‌చేస్తున్నాయి. దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఎలా అంటే చేతిలో డబ్బులు లేకున్న షాపింగ్‌కు వెళ్ళవచ్చు. తద్వారా అవసరం లేనివి కూడా కొని అనవసర ఖర్చులకు లోనౌతున్నాము. ప్రణాళికలో భవిష్యత్తుకు సంబంధించి పెట్టుబడులకు సముచిత స్థానం ఉండేలా చూసుకోవాలి. దీని కోసం ఆర్థిక క్రమశిక్షణ తప్పని సరి ప్రధానంగా వాయిదా వేసే ధోరణి ( వచ్చే నెల నుంచి లేదా వచ్చే సంవత్సరం నుంచి పొదుపు లేదా మదుపు చేద్దాం అని అనుకుంటూ వెళ్లడం) మానుకోవాలి. స్థిరమైన ఆదాయం లేనప్పుడు భారీ ఆస్తులను సమకూర్చుకునే ఉద్దేశంతో అప్పులు చేయడం మెడకు ఉరితాడు బిగించుకోవడం లాంటిదే అని గుర్తు పెట్టుకోవాలి. మరియు ప్రక్కవాళ్ళ (తమ కంటే పైస్థాయి) జీవనశైలితో పోల్చుకొని ఆడంబరాలకు పోవడం పులిని చూసి నక్కవాత పెట్టుకోవడమే అని మర్చి పోకూడదు. భవిష్యత్తుకి సంబంధించి అత్యవసర నిధి తప్పని సరి ఉండేలా చూసు కోవాలి. భవిష్యత్తుద్రవ్యోల్పణాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువు, వివాహాది శుభకార్యాల కోసం ఆది నుంచే కేటాయి ంపులు తప్పని సరి.

ఇటీవలవారాంతపు పార్టీలు మొదలయ్యాయి.5 రోజులు పని చేసి ఉపశమనం కోసం ఆటవిడుపు ఆమోదయోగ్య మైనప్పటికీ ఆపార్టీ పేరుమీద ఐదురోజుల సంపాదన ఆవిరయ్యేలా చేసుకుంటే నెలచివరలో కుటుంబాన్ని రోడ్డుమీదకి తీసుకెళ్లడం లాంటిదే అని గుర్తు పెట్టుకోవాలి. మరియు పెట్టుబడి పెట్టే ముందు వైవిధ్యాన్ని ప్రదర్శించాలి అంటే ఆంగ్లంలో ఒక జాతీయమైన ‘‘డోన్ట్ఫుట్‌ ఆల్‌ ఎగ్స్ ఇన్సింగలాబస్కెట్‌ ‘‘ అం‌టే పెట్టుబడి మొత్తాన్ని ఒకేపెట్టుబడి వాహకంలో కాకుండా వివిధ సాదనాలలో వాటిరి స్క్రిట్‌ ‌ర్న్రా్ప తిపదికన పెట్టుబడులుగా పెట్టడం ద్వారా ఒకదానిలోని నష్టాన్ని మరో సాధనం నుంచి వచ్చే రాబడి ద్వారా పూడ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఒక అవగాహనతో ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేయడం ద్వారా ఆర్థిక భద్రతతో పాటు, ఆర్థిక లక్ష్యాలను కూడా అనుకున్న సమయంలో చేరుకోవచ్చు.

md
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

Leave a Reply