Take a fresh look at your lifestyle.

వ్యాక్సినేషన్ల సమన్వయానికి ప్రత్యేకాధికారి: సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌ప్రారంభోత్సవానికి నిర్దేశించిన ప్రతీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు ప్రత్యేకాధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ‌సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన బీఆర్కే భవన్‌ ‌నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభానికి పక్రియ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు.

వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్‌ ‌నిబంధనల ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు.అదే విధంగా ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనబడితే వెంటనే తగిన చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా కోవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను రిజర్వ్‌లో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

Leave a Reply