సిద్ధిపేట, సెప్టెంబర్ 28 (ప్రజాతంత్ర బ్యూరో): రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సిద్ధిపేట జిల్లా పర్యటనకు వచ్చారు. జిల్లాలోని ములుగు మండలంలోని కొండలక్ష్మన్ బాపూజీ ఉద్యానవన విశ్వ విద్యాలయం ఆవరణలో గల విఘ్నేశ్వరుని దేవాలయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి, సిపి జోయల్ డేవిస్‌తో కలిసి పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ ప్రాగణంలో గల విఘ్నేశ్వర స్వామి దేవాల యంలో ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించగా ఆర్డీవో విజయేం దర్ రెడ్డి,గజ్వేల్ ఏసీపీ నారాయణ,ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.