Take a fresh look at your lifestyle.

సెటిల్‌మెంట్‌లపై పోలీసుల ప్రత్యేక నిఘా

Special Surveillance of Police on Settlements

  • ఐదుగురిపై రౌడీషీట్‌ – ‌న్యాయం కావాలంటే నేరుగా కలవాలి
  • భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర 

భూదందాలు సెటిల్‌మెంట్లు బెదిరింపులకు పాల్పడటం వంటి అసాంఘీక కార్యకలపాలపై భద్రాచలం పోలీసులు ఉక్కుపాదం మోపార••. ఇటువంటి కార్యకలాపాలు పై భద్రాచలం పాల్పడతున్న భద్రాచలం పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ ‌నేత నక్కా ప్రసాద్‌ ‌సహా ఐదుగురిపై రౌడీషీట్‌ ‌తెలిపారు. వీరిలో నక్కా ప్రసాద్‌పై ఐదు కేసులు నమోదయ్యాయి. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు గాలిస్తున్నారు. గతంలోను ఈయనపై అనేక కేసులు ఉన్నాయి. పోలీసులు అతని కోసం వెతికిన సమాచారం ముందస్తుగా అందుతుండటంతో తప్పిం చుకున్నారు. దీనికి తోడు కేసుల నుండి బయట పడేందుకు కోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేసారు. దీనికి పోలీసులు చెక్‌ ‌పెట్టారు. నక్కా ప్రసాద్‌పై ఉన్న కేసులు వివరాలు పూర్తి స్థాయిలో చూపించి అరెస్టుకు రంగం సిద్దం చేసారు. రాజకీయ నేతల నుండి ఒత్తిళ్ళు వచ్చిన పోలీసులు రాజీ పడకుండా కేసులు నమోదు చేసి రె•డీషీట్‌ ‌తెరిచారు. ఈయనకు తోడుగా చర్ల పోలీస్‌ ‌స్టేషన్‌ల పరిధిలోని మేడువాయ కాలనీకి చెందిన మడకం రవికుమార్‌ ‌యువవతులను వేధిస్తుండగా ఇతర అసాంఘీక కార్యకాలపాలకు పాల్పడుతున్నదున రౌడీషీట్‌ ‌తెరిచారు. ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నట్టు మేకల వీర్రాజు, తానికొండ నరేష్‌, ‌వేల్పుల వెంకన్నలపై కూడ రౌడీషీట్‌ ‌తెరిచారు. ఇసుక అక్రమ కేసుల్లో ఇంకొందరు కూడ ఉండటంతో వారిపై కూడ రౌడీషీట్‌ ‌తెరిచేందుకు పోలీసులు సన్నద్దమవుతుందన్నారు.

 

దుమ్ముగూడెం పోలీసులు పిడియాక్టు కింద కేసు నమోదు చేసారు.  పోలీసులను కలవండి – ఏఎస్పీ : ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని శాంతి భద్రతలకు సంబంధించి ఏమైన సమస్యలుంటే నేరుగా పోలీసులను కలవాలని భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన రౌడీషీట్లకు సంబంధించ వివరాలను వెల్లడించారు. ఐదుగురిపై రౌడీషీట్లు తెరిచామని , వీరు తరచు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతు ప్రజలకు బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారని , పలు కేసులు నమోదై పోలీసులు హెచ్చరించిన వీరిలో మార్పు లేదన్నారు. అందుకే అన్ని కేసులు వివరాలను పరిగనిలోకి తీసుకున్నామని అన్నారు. వీరు పద్దతి మార్చుకోక పోవడంతో రౌ•షీ•ట్‌ ఓపెన్‌ ‌చేసామన్నారు. ముఖ్యంగా భద్రాద్రిలో సెటిల్‌మెంట్లు భూదందాలపై కన్నేసామన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. అసాంఘీక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు 100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. దందాల సంస్కృతి మానుకోవాలని , పోలీసులు ఉక్కుపాదం మోపితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

Leave a Reply