Take a fresh look at your lifestyle.

కేంద్రం తక్షణ సహాయం 1.70 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: కొరోనావైరస్ మహమ్మారి గురించి చర్చించడానికి సౌదీ రాజు సల్మాన్ అధ్యక్షతన ఏర్పాటు అయిన జి -20 నాయకుల వర్చువల్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. జమ్మూ కాశ్మీర్ లో గురువారం తొలి కోవిడ్ -19 మరణానం సంభవించి, భారతదేశంలో కరోనతో మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 649 కు పెరిగింది. ఈ నేపద్యంలో వలస కార్మికులకు పట్టణ, గ్రామీణ పేదలకు తక్షణ సహాయం కోసం అవసరమైన ఒక ప్యాకేజీ కేంద్రం సిద్ధం చేసింది. “దేశంలో ఎవరూ ఆకలితో ఉండరు. ఈ ప్యాకేజీ విలువ 1.7 లక్షల కోట్లు” అని కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న నిర్మల సీతారామన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రత్యక్షంగా ప్రభావితమైన వారి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 1.7 లక్షల కోట్ల విలువైన ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు. వచ్చే మూడు నెలల పాటు పేదలకు ఉచిత ధాన్యాలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ముందంజలో ఉండి పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు 50 లక్షల బీమా చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. గరీబ్ కల్యాణ్ యోజనను ప్రకటించిన సీతారామన్ మాట్లాడుతూ.. 80 కోట్ల మంది పేదలకు వచ్చే మూడు నెలలు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా పిడిఎఫ్ ద్వారా ఇస్తామని చెప్పారు. ఈసరికే ఇస్తున్న 5 కిలోల రేషన్ కంటే అదనంగా.. మరో 5 కిలోల రేషన్ ఇస్తాం అని మంత్రి ప్రకటించారు. అలాగే ప్రజలు తమ ప్రాంతాల ఆధారంగా పప్పు ధాన్యం తింటారని, వారి ప్రాంతీయ అలవాటు ప్రకారం వారు కోరుకునే పప్పు 1కిలో ఉచితంగా ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లాగా మనరేగా వేతనాన్ని 182 రూపాయల నుంచి రోజుకు 202 రూపాయలకు పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ప్రతి కార్మికుడికి 2,000 రూపాయలు అదనపు ఆదాయం అందుతుంది, అని సీతారామన్ అన్నారు. 8.3 కోట్ల బిపిఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఉజ్వాలా లబ్ధిదారులకు వచ్చే మూడు నెలల్లో ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు లభిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుత పిఎం కిసాన్ యోజన కింద 8.69 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వెంటనే 2,000 రూపాయలు ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో 2000 రూపాయల నగదు బదిలీ రైతుల అకౌంట్ కు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. మూడు నెలల్లో రెండు విడతలుగా 1,000 రూపాయలు ఎక్స్-గ్రేసియా 60 ఏళ్లలోపు, సీనియర్లకు, వితంతువులు, వికలాంగులకు కేంద్రం ఇవ్వనున్నది. తద్వారా 3 కోట్ల మంది పేద సీనియర్ సిటిజన్లు, వితంతువులు వికలాంగులకు ప్రయోజనం చేకూరుస్తుంది అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాకుండా, 20 కోట్ల మంది మహిళలకు ధన్ ఖాతా ద్వారా తమ ఇంటిని నడపడానికి మూడు నెలలు, నెలకు 500 రూపాయలు కేంద్రం ఇస్తుంది అని, ఇది కాకుండా 63 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రహిత రుణాలను 20 లక్షలకు రెట్టింపు చేశామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ చర్య ద్వారా 7 కోట్ల గృహాలకు ప్రయోజనం చేకూరుతుంది అని నిర్మల సీతారామన్ తెలిపారు.

- Advertisement -

వ్యవస్థీకృత రంగానికి సంబంధించి రాబోయే మూడు నెలలకు యజమాని, ఉద్యోగికి ఇచ్చే ఇపిఎఫ్ ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుందని, సీతారామన్ ప్రకటించారు. దీని వలన సుమారు 4.8 కోట్ల మంది ఇపిఎఫ్ సభ్యులు ప్రయోజనం పొందుతారు అని సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఇపిఎఫ్ నియంత్రణను సవరిస్తుంది అని దీనివలన కార్మికులు పిఎఫ్ ఖాతా నుండి 75 శాతం తిరిగి చెల్లించని అడ్వాన్స్ లేదా మూడు నెలల జీతం, ఏది తక్కువైతే అది పొందవచ్చు” అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
3.5 కోట్ల రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులకు లబ్ధి చేకూర్చే అందుకు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా 31 వేల కోట్ల కార్పస్‌ ఫండ్ ను ఉపయోగించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు సీతారామన్ తెలిపారు. కరోనావైరస్ వైద్య పరీక్షలు చేయడానికి, అధిక స్థాయిలో కరోనా వైరస్ వైద్య పరీక్షలు చేయడానికి రాష్ట్రాలు ఖనిజ నిధిని ఉపయోగించాలని రాష్ట్రాలను కోరినట్లు సీతారామన్ చెప్పారు.

Leave a Reply