Take a fresh look at your lifestyle.

కాళేశ్వరంలో సిఎం కెసిఆర్‌ ‌దంపతుల ప్రత్యేక పూజలు

పూజల అనంతరం దంపతులకు ఆశీర్వచనం

కాళేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ మహన్యా పూర్వక ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం చేయించారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ ‌దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎం వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొన్న అనంతరం సీఎం కేసీఆర్‌ ‌దంపతులు ప్రాణహిత, గోదావరి సంగమస్థలి పుష్కరఘాట్‌ ‌వద్ద నదీమతల్లికి  పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు  ప్రారంభం తదనంతర నిర్మాణం సందర్భంగా ఎదుర్కున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు.  తెలంగాణ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తూ తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్న ప్రాణహిత గోదావరి జలదృశ్యాన్ని చూస్తూ  ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, అధికార్లు శక్తివంచన లేకుండా కృషిచేశారని అభినందించారు. అనంతరం ఆయన మేడిగడ్డ బయల్దేరారు. కాళేశ్వరం పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలువురు మంత్రులు హెలిపాడ్‌ ‌వద్ద ఘన స్వాగతం పలికారు.

Special pujas of CM KCR couple in Kaleswaram Mukteshwaraswamy temple

సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌గంగుల కమలాకర్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ ‌పుట్ట మధుకర్‌, ‌రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ‌భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ ‌జక్కు హర్షిని సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం పర్యటనకు బయల్దేరారు. సీఎం కేసీఆర్‌ ‌వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.  యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సక్ష చేయనున్నారు.

Leave a Reply