Take a fresh look at your lifestyle.

వలస కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి

సూర్యాపేట, జూన్‌ 4, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): వలస కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి నెలకు 10వేల చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమాండ్‌ ‌చేశారు. గురువారం అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మండల పరిధిలోని కేసారం, టేకుమట్ల, యడ్లపల్లి గ్రామాలలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని 200రోజులు పెంచాలని, అలాగే ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యల ను వెంటనే తీర్చాలని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. సొంత గ్రామాలకు వెళ్లిన తరువాత లాక్‌డౌన్‌ ‌పెడితే వారికి ఇంత ఇబ్బందులు ఉండేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన సోమ్ము ఇంత వరకు కొన్ని కుటుంబాలకు అందలేదని పేర్కొన్నారు. అలాగే ఉపాధి కూలీలకు కనీస మౌలిక వసతులు లేవని, వెంటనే అట్టి సౌకర్యాలను కల్పించాలని తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఉయ్యాల పారిజాత, నల్లమేకల అంజయ్య, పిండిగా జానయ్య, జయ బాబు, గౌని, రమేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply