Take a fresh look at your lifestyle.

గిరిజనాభివృద్దిపై ప్రత్యేక చర్యలు

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవడం జరిగిందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పొట్రో అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటిడిఏ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి అసువులు బాసిన ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌చిత్రపటానికి పూలమాల వేసి ఇ నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివో మాట్లాడుతూ జన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడవ తరగతి పిల్లల పై ప్రత్యేక దృష్టి సారించామని లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల పాఠశాలలు నడవకుండా ప్రత్యేక మాధ్యమాల ద్వారా పిల్లలు చదువు కొనసాగేలా చర్యలు చేపట్టామని అని తెలిపారు. జిల్లా పరిషత్‌ ‌స్కూల్స్ ‌పిల్లల మాదిరిగా గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిం చామని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి పిల్లలు సంబంధిత ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నారని వారికి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. రానున్నది వర్షాకాలం కాబట్టి ఇ మారుమూల ప్రాంతంలో నివసించే ఆదివాసీ గిరిజన కుటుంబాలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సీజనల్‌ ‌వ్యాధులు అయినా మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

వైద్య సిబ్బంది సూచనల మేరకు ప్రతి కుటుంబం వ్యక్తిగత శుభ్రత తో పాటు సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని విద్య వైద్యం మరియు ఆదిమ తెగ గిరిజన కుటుంబాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు రాకుండా త్వరితగతిన పరిష్కరించడానికి కి కృషి చేస్తామని ఐటీడీఏ పీవో గౌతమ్‌ అన్నారు. భద్రాచలం ప్రధాన ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉన్న నా తగినంత సిబ్బంది తో రోగులకు సకాలంలో వైద్యం చేస్తున్నారని తొందరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సిబ్బంది నియమిస్తామని తెలిపారు. వలస వచ్చిన ప్రజలు కరుణ వైరస్‌ ‌రాకుండా ప్రజలు అప్రమత్తంగా చేసి వారికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కరుణ వైరస్‌ ‌గురించి భయపడాల్సిన పని లేదని స్వచ్ఛంద సంస్థలు వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారి చైతన్య పరుస్తున్నారు అన్నారు. పదో తరగతి పరీక్షలు జూన్‌ ఎనిమిదో తేదీ నుండి జరగనున్నందున పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో వారికి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. మాస్కులు, శానిటైజర్‌ ‌లు, సబ్బులు, సర్ఫ్ అం‌దజేస్తామని తెలిపారు. టీచర్లు అందరూ స్థానికంగా ఉండాలని అలా లేని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే సోమవారం జరిగే ప్రజావాణికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడా లని కోరారు. ఈ కార్యక్రమంలో లో ఏ పీ ఓ జనరల్‌ ‌నాగ రావు, డి డి ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌ ‌జహీరుద్దీన్‌, ఏ ఓ ‌బీమ్‌,‌మేనేజర్‌ ‌సురేందర్‌, ‌పి ఎన్‌ ఆర్‌ ‌సి రమణయ్య, జి సి సి డి యం వాణి, మరియు యు.వి వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply