- ఎగుమతులపై నిషేధంతో ధరల కట్టడి
- కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
ఉల్లి సరఫరాకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అందులోభాగంగానే ఉల్లిపాయల ఎగుమతిపై సెప్టెంబర్ 14తేదీ నుండి నిషేధం విధించామని అన్నారు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా దిగుమతులను చేపడుతోందని ఆయన చెప్పారు. నిత్యావసర వస్తువుల చట్టం కింద అక్టోబర్ 23 నుంచి ఉల్లిపాయల నిల్వ పరిమితిని, టోకు వ్యాపారులకు 25 మెట్రిక్ టన్నుల చొప్పున, చిల్లర వ్యాపారులకు 2 మెట్రిక్ టన్నుల చొప్పున విధించడం జరిగిందన్నారు.
అంతేకాదు ఉల్లి విత్తనాల ఎగుమతిని కూడా నిషేధించడం జరిగిందని, పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, మిగులు నిల్వల నుండి ఉల్లిపాయలను సరఫరా చేయడం జరుగుతుందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో రికార్డు స్థాయిలో 742 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించడానికి, భారత ఆహార సంస్థ, రాష్ట్ర ఏజెన్సీలు, సిద్ధంగా ఉన్నాయని, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంస్థలు 627 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాయని, అదే విధంగా, 2020-21 ఖరీఫ్ సీజను కోసం విక్రయకేంద్రాల సంఖ్యను కూడా 30,709 నుంచి 39,122 కి పెంచడం జరిగిందని, మార్కెట్లో వరి ముందుగా రావడంతో, వరి సేకరణ పక్రియ సెప్టెంబర్ 26నుంచి జరిగిందని ఆయన పేర్కొన్నారు.