Take a fresh look at your lifestyle.

కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు : కొండూరి

రాష్ట్రంలోని కార్మికులందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు అన్నారు.మే డే సందర్భంగా సిరిసిల్ల మున్సిపాలిటి అధ్వర్యంలో సినారె కళామందిర్‌లో ఏర్పాటు చేసిన ‘‘చేనేతకు చేయూత’’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పవర్‌లూమ్‌కార్మికులకు రూ 5 వందల నగదుతో పాటు 15రోజులకు సరిపడే నిత్యావసర సరకులను పంపిణి చేశారు.ఈ సందర్భంగా టెస్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో కార్మికులు ఎలాంటి ఆకలి చావులకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ ం ప్రత్యేక దృష్టి సారించిందని,దీనిలో భాగంగానే బతుకమ్మ చీరల తయారి తదితర పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు.లాక్‌డౌన్‌తో సిరిసిల్లలోని కార్మికులు ఎలాంటి కష్టాలు పడవద్దని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు.జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌ ‌మాట్లాడుతూ కొరోనా నియంత్రణకు జిల్లా ప్రజలంతా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని,అత్యవసర పరిస్థితు ల్లో మాత్రమే బయటకు రావాలని,భౌతికదూరం పాటించా లని కోరారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌జిందం కళ చక్రపాణి,వైస్‌ ‌చైర్మన్‌ ‌మంచె శ్రీనివా స్‌, ‌కమిషనర్‌ ‌సమ్మయ్య,చేనేత,జౌళిశాఖ ఏడి అశోక్‌, ‌మ్యాక్స్, ఎస్‌ఎస్‌ఐ ‌సంఘాల యజమానులు, నాయకు లు గూడూరి ప్రవీణ్‌కుమార్‌, శ్రీ‌నివాస్‌, ‌కౌన్సిలర్లు పాల్గొన్నారు.

కార్మికుల శ్రమను గుర్తించాలి
కార్మికుల శ్రమను గుర్తించాల్సిన అవసరం ప్రతిఒక్కరు గుర్తించాలని వేములవాడ మున్పిపల్‌చైర్‌పర్సన్‌ ‌రామతీర్ధపు మాధవి అన్నారు.మేడే సందర్భంగా వేములవాడ మున్పిపల్‌ ఆవరణలో కార్మికులు ఎర్రజెండాను ఎగుర వేసి మున్పిపా టిలో పనిచేస్తున్న కార్మికులను సత్కరించిన అనంతరం రామతీర్ధపు మాధవి మాట్లాడుతూ వేములవాడలో వందలాది భవన నిర్మాణ కార్మికులున్నారని,వీరితో పాటుగా వివిధ రంగాల్లో వందలాది కార్మికులు పనిచేస్తున్నారని,వారందరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. కొరోనా నియంత్రణ కోసం అమలవుతున్న లాక్‌డౌన్‌లో చిత్తశుధ్దితో వేములవాడ మున్పిపాలిటి పారిశుద్య సిబ్బంది,కార్మికులు ,ఇతర సిబ్బంది అహర్శిలు కృషి చేస్తూ వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని,వారి సేవలను ప్రశంసించాల్సి ఉందని అన్నారు.అనంతరం మున్సిపాలిటి లో పనిచేస్తున్న పారిశుద్య సిబ్బందికి మున్సిపాలిటి ఆవరణ లో రామతీర్థపు మాధవి భోజనాలను ఏర్పాటు చేయగా వారితో పాటు రామతీర్ధపు మాధవి,కౌన్సిలర్లు సహపంక్తి భోజనం చేశారు. వైస్‌ ‌చైర్మన్‌ ‌మధు రాజేందర్‌,‌కమిషనర్‌ శ్రీ‌నివాస రెడ్డి,కౌన్సిలర్లు కృష్ణవేణి,నరాల శేఖర్‌,‌యాచమనేని శ్రీనివాస్‌, ‌వంగల దివ్యశ్రీనివాస్‌,‌నిమ్మశెట్టి విజయ్‌, ‌నాయ కులు ఏనుగు మనోహర్‌రెడ్డి,పుల్కం రాజు పాల్గొన్నారు.

Leave a Reply