Take a fresh look at your lifestyle.

సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా

సూర్యాపేట, మే 30, ప్రజాతంత్ర ప్రతినిధి): జిల్లాలో ఎక్కడైనా పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధతులకు పోలీసులు పూర్తిస్థాయి భరోసా, ధైర్యం కల్పించేలా ఇన్వెస్టిగేషన్‌ ‌నిర్వహిస్తామని ఎస్పి ఆర్‌.‌భాస్కరన్‌ అన్నారు. శనివారం జిల్లాలోని చెవ్వెంల పోలీస్‌ ‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పోలీసు స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేసుల పెండింగ్‌, ‌కేసులు పురోగతి, కేసుల దర్యాప్తు, కేసుల ఆన్‌లైన్‌ ‌వంటి వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రికార్డస్ ‌నిర్వహణలో, కేసుల దర్యాప్తులో జాప్యం విషయంపై సిబ్బందిని హెచ్చరించారు. కేసుల దర్యాప్తు బాగా నిర్వహిస్తేనే నింధితులకు శిక్షలు పడి, నేరాలు తగ్గుతాయని గుర్తుచేశారు. ఫిర్యాదులను స్వీకరించడం, కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధితులు పోలీస్‌ ‌స్టేషన్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని అన్నారు.

పైరవీలు చేస్తేనే పని చేస్తే అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిబ్బందికి సూచించారు. ప్రతి ఫిర్యాదును వెంటనే కేసు నమోదు చేయాలని, ఫ్రీ ఎఫ్‌ఐఆర్‌ ‌రిజిస్టర్‌ ‌చేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వెల్లడించారు. అవసరమైతే షీట్స్ ఓపెన్‌ ‌చేయాలని పేర్కొన్నారు. అలాగే దొంగతనాల నివారణ కోసం సిసి కెమోరాలను పెంచాలని, గుడుంబా, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాల అమ్మకాలు, అక్రమ రవాణా నిరోధించడం కోసం సిబ్బంది బాగా పనిచేయాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఆరుబయట మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. రోడ్‌ ‌యాక్సిడెంట్‌ ‌జరగకుండా బారికేడింగ్స్ ఏర్పాటుచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి మోహన్‌ ‌కుమార్‌, ‌సిఐ విఠల్‌, ఎస్సై, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave a Reply