Take a fresh look at your lifestyle.

‌ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుచేయాలి: జంగా

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తలో భాగంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అద్యక్షుడు జంగా రాఘవరెడ్డి డిమాండ్‌ ‌చేశారు. కోవిడ్‌-19 ‌నేపథ్యంలో టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌వో మాలతికి బుధవారం జంగా అందించారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రి (100 పడకల ఆసుపత్రిని) కరోనా బాధితులకు కెటాయించడం వల్ల వివిధ రకాల రోగాల బారిన పడిన వారికి వైద్యసేవలు అందడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే కరోనా బాధితుల ఆసుపత్రిగా ప్రచారం జరిగి భయబ్రాంతులకు గురవుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వెంటనే సమస్యను పరిష్కరించే దిశలో పయణించాలన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్‌ ‌కార్డు ఉన్న ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం, రూ.1500ల నగదు సరిగ్గా అందడం లేదని, కేవలం 80శాతం మందికి మాత్రమే అందుతున్నాయన్నారు.

కులవృత్తులపై ఆధారపడి బ్రతికే చాకలి, మంగలి, కంసాలి, పద్మశాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, వ్యవసాయ, భవన నిర్మాణ కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితితో అర్థాకలితో అలమటిస్తున్నారని వారిని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రైస్‌మిల్లర్లు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. బార్‌దాన్‌ ‌లేక ట్రాన్స్‌పోర్ట్ ‌వాహనాలు సరైన సమయానికి రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే అధికారులు, పాలకులు ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు. జిల్లాను కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దిన రెవెన్యూ, పోలీస్‌, ‌వైద్యులు, పారిశుధ్ధ్య కార్మికుల సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఆయన వెంట మార్కెట్‌ ‌మాజీ చైర్మన్‌ ఎ‌ర్రమల్ల సుధాకర్‌, ‌మున్సిపల్‌ ‌మాజీ చైర్మన్‌ ‌వేమల్ల సత్యనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌మారబోయిన పాండు, డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌గాదెపాక రాంచందర్‌, ‌నాయకులు రాందయాకర్‌రెడ్డి, రంగరాజు ప్రవీణ్‌కుమార్‌, ‌తదితరులున్నారు.

కూరగాయల పంపిణి…
పట్టణంలోని 15వ వార్డులో ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌మారబోయిన పాండు విరాళంగా ఇచ్చిన కూరగాయలను కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి చేతుల మీదుగా పేద కుటుంబాలకు పంపిణిచేశారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూరగాయలు పంపిణి చేసిన పాండు సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి నరేందర్‌, ‌డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌గాదెపాక రాంచందర్‌, 9‌వ వార్డు కౌన్సిలర్‌ ‌చందర్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎండీ మాజీద్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

ఐకేపి సెంటర్‌ను సందర్శించిన జంగా…
రఘునాథపల్లి మండలంలోని కోమల్ల గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సందర్శించి రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ సెంటర్‌లో రైతులు ధాన్యం పోసి 8రోజులు గడిచినా ట్రాన్స్‌పోర్ట్ ‌వాహనాలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని, మ్యాచర్‌ ‌పేరు మీద రైతులను ఇబ్బంది పెడుతున్నారని, బస్తాకు 3కేజీల చొప్పున రైస్‌మిల్లర్లు తగ్గించడం సరైంది కాదన్నారు. వెంటనే రైతు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే కాంగ్రెస్‌పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.ఆయన వెంట రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, కాంగ్రెస్‌ ‌నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులున్నారు.

Leave a Reply