Take a fresh look at your lifestyle.

కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు

గురువారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో కరోనా వైరస్‌ ‌నియంత్రణ, దేశంలో తాజా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ చర్యలపై కేంద్రం సభ్యులకు వివరించింది. అనంతరం అన్ని పార్టీల నుంచి సలహాలు, సూచలను ఇవ్వాలని కేంద్రం ఎంపీలను కోరింది. ఈ అంశంపై లోక్‌ ‌సభలో ఎంపి నామా మాట్లాడుతూ… కరోనా వైరస్‌ ‌నియంత్రణ కోసం కేంద్రం రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు. భూరికార్డుల ఆధునీకరణ కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 94.52 కోట్ల రూపాయలు ఇచ్చింది. వీటిలో 90 శాతం నిధులకు తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చూపలేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తూ మోడీ ప్రభుత్వంపై కెసిఆర్‌ ‌విమర్శలు చేయడమేంటి?. కేంద్రం ఇచ్చే నిధులను సైతం సక్రమంగా వాడుకోలేని నిస్సహాయ స్థితిలో కేసీఆర్‌ ‌సర్కారు ఉంది. వాటర్‌ ‌షెడ్‌ ‌నిధుల కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల తెలంగాణ రైతులకు150 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. రాష్ట్రంలోని రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం తప్ప… వారి సంక్షేమం పట్ల కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా కేంద్రం తెలంగాణకు 106.23 కోట్ల రూపాయలు విడుదల చేయగా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాను చెల్లించాల్సిన 61.29 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు.

జాతీయ రహదారుల నిర్వహణ అధ్వానం:
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్వాహణపై రాజ్యసభ జీరో అవర్లో గళం విప్పిన రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్‌. ‌తెలంగాణలో జాతీయ రహదారుల నిర్వాహణఅద్వానంగా ఉందని, రోడ్లు బాగలేక అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్‌ ‌కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గురువారం రాజ్య సభలో జీరో అవర్‌ ‌లో మాట్లాడిన ఆయన… రాష్ట్రం మీదుగా పోయే నేషనల్‌ ‌హైవేలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. హైవేలపై అండర్‌ ‌పాస్‌ ‌లు, సర్వీస్‌ ‌రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నల్లగొండ మీదుగా పోయే ఎన్‌ ‌హెచ్‌ 165 ‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సభ కు వివరించారు. సర్వీస్‌ ‌రోడ్డు, ప్రత్యేక కంచెలు లేకపోవడం వల్ల పశువులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నాయని చెప్పారు. ఈ ఘటనల్లో ప్రయాణికులతో పాటూ, పశువులు కూడా మరణిస్తున్నారని తెలిపారు. చిట్యాల, నకిరెకల్‌, ‌సూర్యాపేట్‌ ‌జనగాం క్రాస్‌ ‌రోడ్‌ ‌వంటి ప్రాంతాల్లో సర్వస్‌ ‌రోడ్లు నిర్మించాలని డిమాండ్‌ ‌చేశారు. జాతీయ రహదారులపై డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇండ్ల పైకి నీరు వస్తుందన్నారు. ఈ సమస్యపై ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినా,కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్రాన్ని తప్పు పట్టారు.

కరోనా నియంత్రణకు ప్రత్యేక నిధులు ఇవ్వండి:
సూచించారు. విపత్కర పరిస్థితులుగా గుర్తించి మరిన్ని వైరస్‌ ‌నిర్ధారణ యంత్రాలు, ప్రత్యేక కిట్లు సరఫరా చేయాలని కేంద్రాన్ని నామా కోరారు. రాజ్య సభలో లిఖిత పూర్వకంగా పలు సూచలను కేంద్రానికి ఇచ్చినట్లు ఎంపి బడుగు లింగయ్య యాదవ్‌ ‌తెలిపారు. సామాన్యులు ప్రయాణించే బస్‌ ‌స్టాండ్‌, ‌రైల్వే స్టేషన్ల లో వైరస్‌ ‌గుర్తింపుకు సంబంధించి మరింత పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్ని మాస్క్ ‌లు, సానిటైజర్స్ ‌విక్రయించే వ్యాపారస్తులు బిజినెస్‌ ‌గా మల్చుకుంటున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం మాస్క్ ‌లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

ఇందిరమ్మ వరద కాలువకు 382 కోట్లు:
ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్ట్ ‌కు కేంద్ర సహాయంగా 382 కోట్ల రూపాయలను 2016లోనే విడుదల చేసిందని, ఇకపై ఈ ప్రాజెక్ట్ ‌నిర్మాణానికి సెంట్రల్‌ అసిస్టన్స్ ‌కు అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్ట్ ‌నిర్మాణం, కేంద్ర సహాయంపై గురువారం లోక్‌ ‌సభలో ఎంపి రంజిత్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్‌ ‌లాల్‌ ‌కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 11 ప్రాజెక్ట్ ‌లకు ప్రధాన్‌ ‌మంత్రి కృషి సించాయ్‌ ‌యోజన-యాక్సిలరేటెడ్‌ ఇరిగేషణ్‌ ‌బెనిఫిట్స్ ‌ఫోగ్రాం(పిఎంకెఎస్వై-ఎఐబిపి) పథకంలో భాగంగా దశల వారీగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత కల్పించినట్లు చెప్పారు. ఎఐబిపి కింద ఇందిరమ్మ ఫ్లడ్‌ ‌ఫ్లో కెనాల్‌ ‌ప్రాజెక్ట్ అల్టిమేట్‌ ఇరిగేషన్‌ ‌పొటెన్షియల్‌(‌యూఐపి) 40 వేల హెక్టార్లని వివరించారు. అయితే, వచ్చే ఏడాది జూన్‌ ‌నాటికి ఈ ప్రాజెక్ట్ ‌పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌కోసం గడిచిన నాలుగేళ్ల(2016-20) లో రూ. 790.77 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

ఆర్సెనిక్‌, ‌ఫ్లోరైడ్‌ ‌ప్రభావిత ప్రాంతాలకు 795 కోట్లు:
ఆర్సెనిక్‌, ‌ఫ్లోరైడ్‌ ‌ప్రభావిత రాష్ట్రాల్లో కమ్యూనిటీ వాటర్‌ ‌ప్యూరిఫికేషన్‌ ‌ప్లాంట్ల స్థాపన, పైపుల ద్వారా నీటి సరఫరా పథకాలను ఏర్పాటు కోసం కేంద్రం చేపట్టిన చర్యలు ఏంటని లోక్‌ ‌సభలో ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్‌ ‌లాల్‌ ‌కటారియా రాత పూర్వక సమాధానం ఇచ్చారు.తెలంగాణలో ఆర్సెనిక్‌, ‌ఫ్లోరైడ్‌ ‌ప్రభావిత ప్రాంతాలకు దాదాపు 795 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. నీతి ఆయోగ్‌ ‌సిఫారసు చేయటంతో, 94.58 కోట్లు, నేషనల్‌ ‌వాటర్‌ ‌క్వాలిటీ సబ్‌ ‌మిషన్‌(ఎన్‌ ‌డబ్ల్యూక్యూఎస్‌ఎం) ‌స్కీంలో భాగంగా 700.23 కోట్లను విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.