వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు ప్రబల కుండా నియంత్రించేందుకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంప్ కార్యాల యంలో కమిషనర్ అధికారులతో సమావేశమై వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ నగరంలోని 183 మురికివాడలలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా ఆయా డివిజన్లలో సానిటరీ ఇన్సెస్పెక్టర్లు, జవాన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎంహెచ్ఓ రాజి రెడ్డిను ఆదేశించారు. ఆయా కమిటీలు శానిటేషన్ సక్రమంగా జరిగేలా నిరంతరం పర్యవేకక్షిస్తార న్నారు. ముఖ్యంగా మురుకివాడలలో వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
బల్దియా ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ టీంలను నియమించి ఆకస్మికంగా పారిశుద్ధ్యాన్ని తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యం లోపం ఎక్కడైనా కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు గైకొనున్నట్లు తెలిపారు. ఆగస్ట్ 15 కల్లా నిర్దేశించిన మరుగుదొడ్లు లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్నారు. అందు••నగుణంగా పనులలో వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధిలో ఉపస్థితిలో ఉన్న 62 మరుగుదొడ్లు సక్రమంగా పని చేసేలా చూడాలన్నారు. 44 కొత్తగా నిర్మించుటకు గుర్తించిన మరుగుదొడ్లలో 4 మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 40 మరుగుదొడ్లును త్వరితగతిన పూర్తి చేయాలని ఈఈ లక్మా రెడ్డిను ఆదేశించారు. ఈసమావేశానికి బల్దియా ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్ రాజిరెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి, ఆస్కి ప్రతినిధి రాజమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.