Take a fresh look at your lifestyle.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్‌

రెబ్బెన, జూన్‌ 5, ‌ప్రజాతంత్ర విలేఖరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ‌సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రెబ్బెన మండలంలోని పాశిగాం, లక్ష్మీపూర్‌ ‌గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలినడకనగ్రామంలో పర్యటించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా పాశిగాంలోని సర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. నర్సరీ నిర్వహణపై సంతృప్తి వ్యక్తంచేశారు. నర్సరీ ఎదుట బొర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. మిషన్‌ ‌భగీరథ పథకంలో భాగంగా ఇంటిం టికి ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్‌ ‌పైపు నుండి వాహనాలు వెళ్లడంతో చెడిపోగా పరిశీలించిన కలెక్టర్‌ ‌వెంటనే రోడ్డు కింది కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. మురికి కాలువను పరిశీలించగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పూడిక తీయకపోవడంతో అడుగు భాగం వరకు పూడిక చేపట్టాలని సూచించారు. నీరు వృథాగా పారే ప్రదేశాల్లో ఇంకుడుగుంత లను నిర్మించాలని సూచించారు. చేతి పంపుల వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఉండాలని అన్నారు. గ్రామంలో పగలే విద్యుత్‌ ‌దీపాలు వెలుగుతుండటాన్న గమనించిన కలెక్టర్‌ అదనపు వైరును ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నించారు.

కనెక్షన్‌ అప్పుగా ఉండటంతో విద్యుత్‌ ‌దీపాలు వెలుగుతున్నాయని సమాధానం ఇవ్వడంతో వెంటనే సరి చేసి పగలు వీది దీపాలు వెలగకుండా చూడాలని అన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లే దారిలో నీటి ప్రవాహం ఉండడంతో కల్వర్టు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరగా పైపులు వేసి సమస్యనుపరిష్కరిస్తామని కలెక్టర్‌ ‌హామీ ఇచ్చారు. గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉనానయనికితా బిచ్చారు. అనంతరం లక్ష్మీపూర్‌లో పర్యటించారు. నర్సరీతో పాటు గ్రామంలో కలియ తిరిగి మురికికాలువను పరిశీలించారు. చిన్న చిన్న సమస్యలను పంచాయితీ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామైఖ్య సంఘానికి భవనం మంజూరు చేయాలని కోరగా, భవనం లేదా ఇంటి అద్దె మంజూరు చేస్తామని అన్నారు. గంగాపూర్‌, ‌లక్ష్మీపూర్‌ ‌ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లు గ్రామస్తులు కలెక్టర్‌ ‌దృష్టికి తీసుకె ళ్లారు. అక్రమ ఇసుక రవానా తమ దృష్టికి సైతం వచ్చిందని, అక్రమ రవాణాను అరికట్టేందుకు కంట్రో ‌రూం సైతం ఏరాపటు చేసినట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో వేణు, ఏంపిపి జుమ్మిడి సౌందర్య, జెడ్పీటిసి వేముర్ల సంతోష్‌, ‌తాహసీల్దార్‌ ‌రియాజ్‌ అలీ, ఎంపిడివో సత్యనారాయణ సింగ్‌, ‌పాశిగాంం సర్పంచ్‌ ‌మోర్లె శ్రీనివాస్‌, ‌లక్ష్మీపూర్‌ ‌సర్పంచ్‌ ‌కోలే శ్యాంరావు, ఎంపిటిసి వొలువోజి హరిత, ఎంపివో అంజద్‌పాషా, ఏపివో కల్పన, ఏపిఎం వెంకటరమణ శర్మ, ఏఈ సుహన్‌, ‌నాయకులు ఆనంద్‌, ‌వెంకటేశం చారీ పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!