Take a fresh look at your lifestyle.

ఆన్‌లైన్‌ ‌క్లాసులపై ప్రత్యేక దృష్టి

కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపద్యంలో గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డిజిటల్‌ ‌తరగతులకు విశేష స్పందన లభిస్తోంది డి.డి జహూరుద్దీన్‌ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌  ఆదేశాలు, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ప్రత్యేక చొరవ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలోని ఆశ్రమ పాఠశాల 03నుండి 10వ తరగతి గిరిజన విద్యార్ధినీ విద్యార్థులకు సంబందించిన ఆన్లైన్‌ ‌తరగతులపై ప్రత్యేక దృష్టి సారించామని భద్రాచలం ఐటిడిఏ గిరిజన సక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు విద్యాబోదన పై మక్కువ కనబర్చుతున్నారని డిటిడిఓ,ఎటిడిఓ ప్రధాన ఉపాద్యాయులు ,క్షేత్రస్థా యిలో డిజిటల్‌ ‌తరగతులను పరిశీ లించి విద్యార్థులకు తగు సూచనలు చేస్తున్నారు. చరవాణి,టివీల ద్వారా డిజటల్‌ ‌తరగతులు గిరిజన విద్యార్థులు వీక్షిస్తున్నారు.

ఎ.టి.డి.ఓల పర్యవేక్షణలో కళా జాత కార్యక్రమాల ద్వారా గిరిజన ఆవాస ప్రాంతాలలో గిరిజన విద్యా ర్థుల తల్లితండ్రులకు ప్రత్యేక అవగా హన కల్పించి టి.విలు ఉన్న ఇం• ్లలలో టిషార్ట్ ‌ద్వారా తరగతుల వారిగా ఆన్లైన్‌ ‌పాఠాలు వీక్షిం• •డానికి ప్రత్యేక మైన ఉపాధ్యాయ బృందాలను ఏర్పాటు చేయడం జరి గిందని అన్నారు. ఉపాధ్యాయులు గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్క పిల్ల వాడిని విడిచి పెట్టకుండా ప్రతీ ఉపాద్యాయుడు 15 మంది పిల్లలను దత్తత తీసుకొని మారుమూల గిరిజన గ్రామాలలో ఇండ్లలోని పిల్లలకు తప్పకుండా ఆన్లైన్‌ ‌టీషార్ట్, ‌దూరదర్శన్‌ ‌యాదగిరి చానల్స్ ‌ద్వారా పాఠాలు చూసుకొని నేర్చు కొనేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు.  ఆశ్రమ పాఠశాలలోని ప్రదానోపాద్యాయులు,ప్రాదమిక పాఠశాలలోని,ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు టీషార్ట్ ‌స్మార్ట్ ‌ఫోన్‌ ‌ద్వారా ఆన్‌ ‌లైన్‌ ‌పాఠాలు డి.డి యాదగిరి చానల్‌ ‌ద్వారా వీక్షిస్తున్నది లేనిది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి గ్రామాలలో పర్యటించి పిల్లలకు సబ్జెక్ట్ ‌లు ప్రతీరోజు విద్యార్థులతో కలిసి డిజిటల్‌ ‌తరగతులపై సందేహాలను నివృత్తి చేస్తున్నారని అన్నారు. గిరిజన కళాజాత ద్వారా ఆన్లైన్‌ ‌పాఠాలు గురించే కాక బ• •బాటకు సంబందించిన అంశాలను గ్రామాలలో తెలియ పరచి పిల్లలను గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చేర్చే విదంగా విద్యా ర్థుల తల్లి తండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు.

Leave a Reply