Take a fresh look at your lifestyle.

సంక్రాంతి సెలవులతో మొదలైన ప్రయాణాలు

Special buses to accommodate congestion

  • రైలు,బస్‌ ‌స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ
  • ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
  • ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలన్న పోలీసులు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌సంక్రాంతి పండుగ సెలవుఉల మొదలయ్యాయి. శనివారం రెండో శనివారంతో పాటు వరుస సెలవులు వస్తున్నాయి. దీనికితోడు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే హైకోర్టుకు కూడా సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పండగరద్దీ మొదలయ్యింది. సెలవులతో అంతా ఊరెళ్లేందుకు ప్లాన్‌ ‌చేసారు. పండగ సంబురాలు జరుపుకునేందుకు నగరం నుంచి గ్రామ బాట పడుతున్నారు. పండుగకు సెలవులు ఉండడంతో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు గ్రామాలకు పయనమవుతారు. దీంతో నగరంలోని పలు కాలనీల్లో ఇళ్లకు తాళాలు పడనున్నాయి. ఇదే అదునుగా దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇళ్ల తాళాలు పగల గొట్టి అందినకాడికి దోచుకోవడం మనం ప్రతి ఏటా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దొంగలబారిన పడకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సంక్రాంతి సెలవుల సమయంలో తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు పోలీసు సూచనలు పాటించాలని రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ’బీ కేర్‌ ‌ఫుల్‌’ అం‌టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తు సరూర్‌నగర్‌, ‌చైతన్యపురి పోలీసులు కరపత్రాలను కాలనీలలో పంపిణీ చేయడంతోపాటు ముఖ్య కూడళ్లు,జనరద్దీ ప్రాంతాల్లో గోడలకు కరపత్రాలను అంటిస్తూ అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.

పోలీసు గస్తీ ఎలాగూ ఉంటుంది… దీనికి తోడు ఊళ్లకు వెళ్లే వారు పోలీసు సూచనలు పాటిస్తే చాలా వరకు దొంగతనాలను నివారించవచ్చంటున్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు, నగదు పెట్టరాదని, నగదు, నగలు బ్యాంక్‌ ‌లాకర్లలో దాచుకోవడం శ్రేయస్కరం అని హెచ్చరించారు. ఇంటి ముందు తలుపులకు బయట తాళం వేయకుండా కేవలం సెంటర్‌ ‌లాక్‌ ‌వేయాలన్నారు. ప్రధాన ద్వారం ముందు చెప్పులు ఉంచి, ఇంటి లోపల లైట్లు వేసి ఉంచితే ఇంట్లో జనం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దని, తాళం కనబడకుండా కర్టన్లు వేయాలన్నారు. ఊరికి వెళ్లే సమయంలో ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలి. అంతేగాకుండా ప్రతి రోజు ఫోన్‌ ‌చేసి సమాచారం తెలుసుకోవాలన్నారు. సెలవుల సమయంలో దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కాలనీలలో ముందు జాగ్రత్తచర్యల గురించి వివరిస్తూ ఆటోల ద్వారా మైకుల్లో చెబుతున్నారు. దీంతో పాటు మప్టీ పోలీసు సిబ్బంది కాలనీల్లో ముమ్మరంగా గస్తీ చేపడుతున్నారు. దొంగతనాల నివారణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలను వివరిస్తూ రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన సమాచారాన్ని సోషల్‌ ‌నెట్‌వర్క్ ‌ద్వారా ప్రజలకు చేరవేస్తూ, వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా పోలీస్‌ ‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. ఎప్పుడు వేళ్లేది..తిరిగి ఎప్పుడు వచ్చేది వివరాలు చెబితే ఆ ఇంటిపై పోలీసు నిఘాతోపాటు రాత్రి సమయంలో గస్తీ పెట్టడం జరుగుతుందన్నారు. .కాలనీల్లో అనుమానంగా సంచరించే వారి గురించి వెంటనే 100కు లేదా పోలీస్‌ ‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. ఇండిపెండెంట్‌ ‌గృహాలలో నివసించే వారు పోలీసుల పోన్‌ ‌నెంబర్లు తమ వద్ద పెట్టుకుని పోలీసుల సహాయం తీసుకోవాలి. సెలవు రోజుల్లో ప్రతి కాలనీలో గస్తీని అధికం చేస్తున్నాం. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లోపెట్రోలింగ్‌ను అధికం చేయడం, బీట్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడుపర్యవేక్షిస్తున్నారు.

రద్దీకి అనుగుణంగాప్రత్యేక బస్సులు
సంక్రాంతి రద్దీని ముందే ఊహించి టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ అధికార యంత్రాంగం 4,940 స్పెషల్‌ ‌బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌, ‌గౌలిగూడ సీబీఎస్‌, ఉప్పల్‌ ‌క్రాస్‌ ‌రోడ్‌, ఎల్‌బీనగర్‌, ‌లింగంపల్లి, చందానగర్‌, ఇసీఐఎల్‌, ‌కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, అ‌ర్‌పేట, టెలిఫోన్‌ ‌భవన్‌, ‌దిల్‌సుఖ్‌నగర్‌ ‌బస్‌స్టేషన్ల నుంచి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకే కాకుండా ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్‌ ‌జూబ్లీ బస్‌స్టేషన్‌ ‌నుంచి కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ‌మెదక్‌ ‌జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్‌ ‌బస్సులు, స్పెషల్‌ ‌బస్సులు నడవనున్నాయి. ఉప్పల్‌ ‌క్రాస్‌ ‌రోడ్‌, ఉప్పల్‌ ‌బస్‌స్టేషన్‌ ‌నుంచి…యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, ‌తొర్రూర్‌, ‌వరంగల్‌ ‌వైపు వెళ్లే షెడ్యూల్‌ ‌బస్సులు, స్పెషల్‌ ‌బస్సులు నడవనున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ ‌బస్‌స్టేషన్‌ ‌నుంచి..మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే షెడ్యూల్‌ ‌బస్సులు, స్పెషల్‌ ‌బస్సుల నడవనున్నాయి. గౌలిగూడ సీబీఎస్‌ ‌బస్‌స్టేషన్‌ ‌నుంచి…కర్నూల్‌ ‌వైపు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు వైపు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లి వైపు వెళ్లే షెడ్యూల్‌ ‌బస్సులు, స్పెషల్‌ ‌బస్సులు నడవనున్నాయి.

Tags: Festivities, bus stops, railway stations, dilsuk nagar, secundrabad

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy