Take a fresh look at your lifestyle.

ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే రాజద్రోహం కేసు

  • సిఎం కెసిఆర్‌ను తాగుబోతు అంటారా
  • డ్రగ్స్ ‌టెస్టుకు నేను సిద్దం..రాహుల్‌ ‌సిద్దమా?
  • కాంగ్రెస్‌, ‌బిజెపిలవి చిల్లర రాజకీయాలు
  • పిసిసిని కొనుక్కున్నోడు..రేపు టిక్కెట్లు అమ్ముకోడా
  • ఉనికి కోసమే బండి సంజయ్‌ ‌పాదయాత్ర
  • టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికే ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌షర్మిల పార్టీలు
  • అన్ని పార్టీలవి తెలంగాణను తక్కువ జేసే కుయత్నాలు
  • అందరి జాతకాలు మా వద్ద ఉన్నాయి..వారి బండారం బయటపెడతాం
  • తెలంగాణకు నిజమైన విముక్తి రోజు జూన్‌ 2 ‌మాత్రమే
  • వి•డియాతో చిట్‌చాట్‌లో మంత్రి కెటిఆర్‌

ప్రతి పక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వొచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై కేటీఆర్‌ ‌ఘాటుగా స్పందించారు. తాను అన్ని డ్రగ్స్ అనాలసిస్‌ ‌టెస్టులకు సిద్ధమని..రాహుల్‌ ‌గాంధీ సిద్ధమా.. అని కేటీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. డ్రగ్స్‌కు అంబాసిడర్‌ అని అంటారా..తనకు డ్రగ్స్‌కు సంబంధం ఏంటని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు..ఈడీకి లెటర్‌ ఇచ్చాడని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో వి•డియాతో చిట్‌ ‌చాట్‌ ‌సందర్భంగా కేటీఆర్‌ ఈ ‌వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పార్టీలకు సిల్లి పాలిటిక్స్ ‌మాత్రమే తెలుసని కేటీఆర్‌ ‌దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాత్రం తెలియదన్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పని లేక ఒకరు పాదయాత్ర చేస్తున్నారు. ఇంకొకరేమో తాను ఉన్నానని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జనసంఘ్‌ ఉం‌దా అని ప్రశ్నించారు.

బీజేపీ నాయకులు చరిత్రకు మతం రంగు పూస్తున్నారని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు..జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని కేటీఆర్‌ ‌విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వోట్లను చీల్చడం కోసమే కొత్త పార్టీలు వొస్తున్నాయన్నారు. ఏదో ఒక జాతీయ పార్టీతో కొమ్ము కాస్తున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌గతంలో కేసీఆర్‌ను పొగిడారు.. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు రాకపోతే..కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడని కేటీఆర్‌ అడిగారు. షర్మిల కూడా అలానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపైనా కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ ‌సెక్రటేరియట్‌కు వొచ్చాడా.. ఫామ్‌ ‌హౌస్‌లో ఉన్నాడా కాదు..పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వొదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు, బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని కేటీఆర్‌ అన్నారు.

కొంత మంది నాయకులు బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసి పైసలు సంపాదిస్తున్నారు. సున్నాలు వేసుకునే వాళ్లు..కన్నాలు వేస్తున్నారు. మల్లారెడ్డి సవాల్‌కు భయపడి పారిపోయినోడు..నోటికి వొచ్చినట్టు వాగడం తప్ప ఏం చేయడం లేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచినా…ఓడినా ఏవి• తలకిందులు కాదన్నారు. హుజూరాబాద్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈటల జానారెడ్డి అంత పెద్దోడు కాదని…మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ‌గెలుస్తుందని చెప్పారు. మార్కెట్‌లో తాను ఉన్నా అని చెప్పుకునేందుకే బండి సంజయ్‌ ‌పాదయాత్ర చేస్తున్నాడన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ ‌కూడా రాదన్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌కు వోట్లేసిన వాళ్లు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ ‌గజ్వెల్‌ ‌సభపై మాట్లాడుతూ.. గజ్వెల్‌ ‌కాకుంటే ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని…ఎవరొద్దన్నారని కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. పీసీసీ పదవి అమ్ముకున్నారని కాంగ్రెస్‌ ‌నేతలే అంటున్నారని…టికెట్ల రేట్లు పెంచి అమ్ముకునేందుకే ఇలాంటి సభలు పెడుతున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో ప్రతాప్‌ ‌రెడ్డి అంతకంటే పెద్ద సభ పెట్టారని ఏమైందని ప్రశ్నించారు. సాయుధ పోరాటంలో పాల్గొన్నవాళ్లకు పెన్షన్‌ ఎం‌దుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్‌. ‌కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలకు కేసీఆర్‌ను తిట్టడం తప్ప… బీజేపీ, కాంగ్రెస్‌లు  కనబడడం లేదన్నారు.

తెలంగాణను ఫెయిల్యూర్‌ ‌స్టేట్‌గా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జూన్‌ 2 ‌తెలంగాణకు అసలైన విమోచన దినం అని కేటీఆర్‌ ‌చెప్పారు. సీఎంను తాగుబోతు అన్నోడు మనిషేనా… వాడు చిల్లరగాడు అంటూ కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.అందరి భాగోతాలు తమ దగ్గర ఉన్నాయని…ఒక్కొక్కడి బట్టలూడదీస్తామన్నారు. డ్రగ్స్‌తో తనకేవి• సంబంధం లేదని…కావాలంటే తన బ్లడ్‌, ‌వెంట్రుకల శాంపిల్స్ ఇస్తానని, టెస్ట్ ‌చేయించుకోవచ్చన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేతలు గాడిదలు అయితే..పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్‌ ఎస్టేట్‌ ‌వెంచర్‌ ‌లాంటిదని, మార్కెట్‌ ‌చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్‌ ‌లేదని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ ‌జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్‌ ‌గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ‌వోట్లు చీల్చి జాతీయ పార్టీలకు తోడ్పాటు చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీ బంధు పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్‌ ‌గుర్తుచేశారు.

Leave a Reply