Take a fresh look at your lifestyle.

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

కొరోనా తీవ్రత దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌పోచారం ప్రకటన

కొరోనా కారణంగా  తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు బుధవారం 16 వరకు కొనసాగాయి. ముందుగా బీఏసీలో ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోరితే అసెంబ్లీ సమావేశాలను పొడిగించడానికైనా సిద్ధమని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. అయితే, సమావేశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే ఇద్దరు శాసనసభ్యులకు కొరోనా నిర్ధారణ కావడంతో పాటు అసెంబ్లీ విధులు నిర్వర్తించడానికి వచ్చిన దాదాపు 20 మంది పోలీసులు వైరస్‌ ‌బారిన పడ్డారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్లు, డ్రైవర్లు వ్యక్తిగత సిబ్బందికి సైతం కొరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ ‌పోచారం బీఏసీ సమావేశం నిర్వహించి సభ్యుల అభిప్రాయాలు అడిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల కుదింపు నిర్ణయం తీసుకున్నారు.  తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెవెన్యూ బిల్లుతో పాటు మొత్తం 12 బిల్లులపై చర్చించి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్‌, ‌కేంద్ర విద్యుత్‌ ‌చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు.
ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ సభకు సహకరించిన శాసనసభ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఇద్దరు ఎమ్మెల్యేలకు, పోలీసు, శాసనసభ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందన్నారు. అయితే కొవిడ్‌ ‌వ్యాప్తి నేపథ్యంలో బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని స్పీకర్‌ ‌పోచారం ప్రకటించారు. కొరోనా తీవ్రత తగ్గిన సమయం చూసుకుని మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. అటు మండలిలో కూడా ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి నిరవధిక వాయిదా వేస్త్తూ ఇదే విషయం ప్రకటించారు. కొరోనా వైరస్‌, ‌కేంద్ర విద్యుత్‌ ‌చట్టం, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలపై చర్చించామన్నారు.  అయితే కొవిడ్‌ ‌వ్యాప్తి క్రమంలొ బీఏసీ కమిటీ సూచనల మేరకు, అన్ని పక్షాల సభ్యుల విజ్ఞప్తి మేరకు సభను నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందని ప్రకటించారు. ఈ ఎనిమిది రోజుల పాటు కొవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ.. సభకు సహకరించిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!