Take a fresh look at your lifestyle.

అపర కుబేరుల చేతుల్లో ‘అంతరిక్షం..!’

“ఇస్రోలో ప్రైవేట్ కంపెనీలను దూర్చడానికి ప్రస్తుత సెట్ కం రిమోట్ సెన్సింగ్ పాలసీలను మారుస్తున్నారు. అలాగే కొత్త నావిగేషన్ పాలసీని భారత ప్రభుత్వం తీసుకు వస్తున్న ది . ఈ నేపథ్యంలో భారత స్పేస్ కి సంబంధించిన అన్ని చట్టాలను మార్చి వేస్తున్నారు. మరో పదిహేను రోజులలో ఇస్రో చైర్మన్ కే.శివన్ ప్రైవేటు కంపెనీల వాళ్లతో సమావేశమై, ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష వనరుని ఇష్టా రాజ్యంగా వాడుకుని,  లాభాలు ఆర్జించే లాగ, వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను సంక్ర్చటానికి ఎటువంటి పాలసీలు తీసుకురావాలి అనే విషయంపై ప్రైవేటు కంపెనీల వాళ్లతో చర్చిస్తారు. మరొక ఆరు నెలలలో ఆకాశ వనరు ప్రైవేట్ కంపెనీలకు హస్తగతం కానుంది.”

మనిషి జీవితానికి అవసరమైన ముఖ్యమైన వనరు ఏమైనా వుంది అంటే అది.. “శూన్యం”. అవును మీరు చదివింది నిజమే..మనిషి “నేనే క్రియేటర్” అని అనుకున్నా లేదు “ఆ దేవుడు క్రియేటర్” అనుకున్నా.. ఈ రెండు వాదనలకు పృష్ఠ భూమి శూన్యమే.. శూన్యం లేనిదే మానవ జీవితంలో తాత్విక చింతన లేదు. మానవాళికి ఎంతో ముఖ్యమైన ఆ శూన్యాన్ని దొంగలించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి.. అర్ధం కాలేదు కదా.. ఓసారి శూన్యంలోకి చుడండి.. అద్గదీ మీ కళ్ళు ఎక్కడికి పోయాయి..? అంతరిక్షంలోకి పోయాయి కదా..

ఆ.. ఆకాశ శూన్యంలోకి పోవాలి అంటే మనం ఇస్రోకి పోవాల్సిందే.. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 లో ఆగష్టు 15 నాడు పుట్టింది. ఇస్రో తన విధులను విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో మొదలు పెట్టింది. ఇస్రో ప్రారంభ లక్ష్యం భారత దేశ అభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్నిపరిశోధించడం.. అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యం కోసం దేశ ప్రజలు తమ టాక్స్ డబ్బులు వెచ్చించి, ఇస్రోని ఒక తిరుగులేని అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా తీర్చిదిదుకున్నారు. హాలివూడ్ సినిమా అంత బడ్జెట్ తో అంతరిక్ష ఉపగ్రహాలు లంచ్ లు చేసి.. దేశ ప్రతి పౌరుడు ఇస్రో వైపు గర్వాంగా చూసే అంత గొప్పగా ఇస్రో ఎదిగింది. ఇలాంటి ఇస్రో ఇక ప్రజల సమిష్టి ఆస్తిగా కూండా కొంత మంది ప్రయివేటు వ్యక్తుల చేతి కిందకి పోనుంది..

ఇంతవరకు ఇస్రో తయారుచేసుకునే వివిధ రకాల ఎక్విప్మెంట్ లకు ప్రైవేట్ కంపెనీలు కాంపోనెంట్స్ అందించేవి. ఇప్పుడు ఏకంగా ఇస్రోలోకి దూరి ఆకాశమనే వనరును ప్రైవేట్ కంపెనీలు కొల్లగొట్టనున్నాయి. అంతర్జాతీయ స్పేస్ ఎకానమీ 360 బిలియన్ డాలర్లు ఉండగా అందులో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే ఉందని అందుకే ఇస్రోని ప్రయివేటైజ్ చేస్తున్నాం.. అంటూ భారత ప్రభుత్వం ఇస్రోలోకి ప్రయివేట్ కంపెనీలను జొప్పిస్తున్నది. ప్రస్తుతం ఆకాశ వనరును కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇస్రో మాత్రమే వాడుతున్నది. ఇప్పుడు ప్రైవేటు వారి కోసం ద్వారాలు తెరిచాం కనుక ఇకపై అంతర్జాతీయంగా ఆకాశంలో చేసే ప్రయోగాలలో భారత్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అనే డొల్ల మాట చెప్పి ప్రజల ఆస్తి అయినా అంతరిక్ష వనరు కొద్దీ మంది ధనిక కుబేరుల చేతికి ప్రభుత్వం ఇచ్చివేస్తున్నది.

ఇస్రోలో ప్రైవేట్ కంపెనీలను దూర్చడానికి ప్రస్తుత సెట్ కం రిమోట్ సెన్సింగ్ పాలసీలను మారుస్తున్నారు. అలాగే కొత్త నావిగేషన్ పాలసీని భారత ప్రభుత్వం తీసుకు వస్తున్న ది . ఈ నేపథ్యంలో భారత స్పేస్ కి సంబంధించిన అన్ని చట్టాలను మార్చి వేస్తున్నారు. మరో పదిహేను రోజులలో ఇస్రో చైర్మన్ కే.శివన్ ప్రైవేటు కంపెనీల వాళ్లతో సమావేశమై, ప్రైవేటు కంపెనీలు అంతరిక్ష వనరుని ఇష్టా రాజ్యంగా వాడుకుని, లాభాలు ఆర్జించే లాగ, వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను సంక్ర్చటానికి ఎటువంటి పాలసీలు తీసుకురావాలి అనే విషయంపై ప్రైవేటు కంపెనీల వాళ్లతో చర్చిస్తారు. మరొక ఆరు నెలలలో ఆకాశ వనరు ప్రైవేట్ కంపెనీలకు హస్తగతం కానుంది.

ఇకపై “న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్” అనే రెగ్యులేటరీ బాడీ ఉనికిలోకి వస్తుంది. ఇది ఒక ప్రత్యేక విభాగంగా ఇస్రోతో అనుసంధానంగా పని చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ దీన్ని మోనిటర్ చేస్తుంది అని చెబుతున్నది ప్రభుత్వం. ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందకి వస్తుంది. సాధారణంగా ఇస్రో చైర్మన్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీ పనిచేస్తారు. ఇకపై ఈ పదవిలో ఎవరు ఉంటారు..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్ లో వుండే ఇస్రో రెండు డిపార్ట్మెంట్లుగా విడిపోతుంది. ఇస్రో..ఇన్ స్పేస్.. విడిపోతుంది. ఇస్రో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్..మిషన్స్ కి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఖర్చు భరించే విభాగానికి ప్రజలు అధిపతులు అవుతారు. ఇక న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బోర్డు సభ్యులుగా ప్రయివేటు వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు వుంటారు. వీరి గైడెన్స్ లో ఇన్ స్పేస్ ఉంటుంది ఇది ఉపగ్రహం లాంచ్ లకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంది. అంటే రిమోట్ సెన్సింగ్.. మెట్రోలాజికల్..టెలికమ్యూనికేషన్..కార్టోగ్రాఫీ..అనే లాభాలు ఆర్జించే విభాగాలకు ప్రయివేటు వ్యక్తులు అధిపతులుగా వుంటారు.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ బోర్డు పని ప్రైవేటు కంపెనీలకు అంతరిక్షం ఎలా వాడుకోవాలి అనే విషయంపై సహాయ సహకారాలు అందించడం అలాగే ప్రభుత్వానికి, ప్రైవేటు కంపెనీలకు అనుసంధాన కర్తగా ఉండటం. ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలో తమ ఉపగ్రహాన్ని పంపించాలి అనుకుంటే ఇస్రో వైజ్ఞానిక క్షేత్రాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రయివేట్ కంపెనీలు వాడుకునేలాగా ఇన్ స్పేస్ అన్ని ఏర్పాట్లు చూస్తుంది. ఇలాంటి ఏర్పాటు ఎందుకంటే.. భారతదేశంలో శాటిలైట్ తయారీకి సంబంధించి స్పేస్ లోకి పంపించే రాకెట్ ఉపగ్రహాల కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీలు చాల ఉన్నాయి అయితే లాంచింగ్ కి సంబంధించి పనిచేయగల కంపెనీలు కేవలం మూడు మాత్రమే వున్నాయి . ఇస్రో గుర్తించిన దానిప్రకారం అవి అగ్నికుల్, బెల్లట్రిక్స్, స్కీరూట్. ప్రస్తుతం ఇస్రోలోకి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించటం ద్వారా ఇకపై సాటిలైట్ తయారీ లాంచింగ్ సర్వీసుల పరిధిలోకి ప్రయివేటు వ్యక్తులు వస్తారు.

మన అంతరిక్ష పరిశోధనల ప్రస్తుత ప్రధాన లక్ష్యాలు.. రిమోట్ సెన్సింగ్ దీని వలన భారత భూభాగాలపై నిఘా సాధ్య పడుతుంది. ఇది ప్రధానంగా దేశ మిలట్రీ అవసరాలను తీర్చుతుంది. మెట్రోలాజికల్ అంటే వాతావరణ అవసరాలు తీర్చడం దీని వలన దేశ రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. టెలికమ్యూనికేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అవసరాలు తీర్చడం. ఈ రంగం ఈసరికే ప్రయివేట్ పరం అయినది దీనికోసం ప్రయివేటు సంస్థలు అంతరిక్ష వనరును కొల్లగొట్టే అవకాశాలు మెండుగా వున్నాయి. చివరగా కార్టోగ్రాఫీ అవసరాలు తీర్చడం. అంటే మ్యాప్ లు తయారు చేయటం అనే పనికి కూడా అంతరిక్ష పరిశోధనల అవసరం ఉంటుంది.. ఇకపై ఈ అవసరాలు తీర్చుకోవాలి అంటే.. దేశ ప్రజలు ప్రయివేట్ కంపెనీల వైపు చూడాలి.. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన శూన్యాన్ని ప్రయివేటు వారు దొంగిలించేలాగా ప్రభుత్వం సహకరిస్తుంటే.. మీరు ఇంకా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటే.. శూన్యంలో వున్నాడు అనుకుంటున్నా ఆ.. మీ దేవుడు కూడా మిమల్ని కాపాడలేడేమో.

Leave a Reply