వనపర్తి,ఆగస్టు,05(ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ను బుధవారం నాడు జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పనితీరుతో పాటు స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను పెండింగ్ కేసులో నేరస్థుల అరెస్టుకు సంబంధించిన వివరాలను ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు కోవిడ్ 19 దృష్ట్యా సిబ్బంది ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్కు వచ్చేవారికి శానిటైజర్లు హ్యాడ్వాష్ నీటి వసతి తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. స్ఠేషన్కు వచ్చేవారిని ఎవ్వరిని కూడా నేరుగా తాకవద్దని, సిబ్బంది అందరూ ఒకే దగ్గర కూర్చోవద్దని నిర్తరం భౌతికదారం పాటించాలని, ప్రస్తుత పరిస్థితిలో రెగ్యులర్ గా బ్లూ కోల్టస్ సిబ్బంది ఎక్కువగా ప్రజల మధ్యలో ఉంటారు కాబట్టి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాక శానిటైజ్ చేసుకొని స్నానంచేశాకే ఇంట్లోకే వెళ్లాలని కుటుంబ సభ్యులుకుడూ జాగ్రత్తలు పాటించేటట్లు చూసుకోవాలని ప్రతిరోజు సివిటమిన్ ప్రోటీన్లు వున్న ఆహారం తీసుకోవాలని రోజుకు మూడు నాలుగు సార్లు వేడిగా వున్న కషాయాలు తీసుకోవాలన్నారు. ఇంటికి సంబం ధించిన నిత్యవసర సరుకులు పండ్లు కూరగాయలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి తెలిపారు. అలాగే మదనాపూర్ పోలీస్స్టేషన్ భవన పనులను నైజాంకాలంనాటిపురాతన పోలీస్స్టేషన్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆత్మకూరు సిఐసీతయ్య, ఎస్సై ముత్తయ్య, పోలీస్సిబ్బంది ఉన్నారు.