Take a fresh look at your lifestyle.

మూగబోయిన గాన గాంధర్వుడు

శోకసముద్రంలో అభిమానులు

ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి పాట పంచా మృతమే. తెలుగు సినిమా పాటకు ఘంటసాల తరు వాత లభించిన సిసలైన వారసుడు, ఉత్తమ గాయ కుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డులతో పాటు, కేంద్రం ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మ కమైన పద్మశ్రీ, పద్మభూషణ పురస్కారాలను అందుకున్న మనబాలు, కొరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతు శుక్రవారం మరణించారు. కొరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంది. అయితే తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన బాల సుబ్రహ్మణ్యం చివరికి ప్రాణాలు కోల్పోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను టాలీవుడ్‌తో పాటు అన్ని సినీ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఎస్‌. ‌పి. బాలసుబ్రహ్మణ్యం (జ. 1946 జూన్‌ 4 – 2020 ‌సెప్టెంబరు 25) గాపిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగాయకుడు, సంగీతదర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషలలో సుమారు 41 వేల 230 పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అనిపిలుస్తారు. ఈయన ఉత్తర ఆర్కాడు జిల్లా (ప్రస్తుత తిరువళ్ళూరు జిల్లా) లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్‌ ‌కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించాడు. 1966 లోపద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీమర్యాదరామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపుతట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలువచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనాశైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరోప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశాడు. కమల్‌హాసన్‌, ‌రజనీకాంత్‌, ‌సల్మాన్‌ఖాన్‌,  ‌విష్ణువర్ధన్‌, ‌జెమిని గణేశన్‌, ‌గిరీష్‌కర్నాడ్‌, అర్జున్‌, ‌నగేష్‌, ‌రఘువరన్‌ ‌లాంటివాళ్ళకి గాత్ర దానం చేసాడు.
సినిమాల్లోనే కాక టి.వి రంగంలోఆయన పాడుతాతీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.బాలుకు భారత దేశ కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లోపద్మభూషరస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేష్‌ ‌ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలుపురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.
అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ‌ఫేర్‌ ‌దక్షిణాది పురస్కారాలు, ఒకఫిల్మ్‌పేర్‌ ‌పురస్కారం అందుకున్నాడు. 1979లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981లో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్‌దూజేకేలియే చిత్రానికిగాను రెండో సారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగరసంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియోల్యాబ్‌కు ‘‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’’ అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.
చాలా మంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడిప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది.. తెలుగు, తమిళ మేకాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలన చిత్రమూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ‌ఫర్‌ ఇం‌డియన్‌ ‌ఫిల్మ్ ‌పర్సనాలిటీ ఆఫ్‌ ‌ది ఇయర్‌ 2016) ‌ప్రధానం చేసారు.బాలు అస్తమయంతో సాంస్కృతిక ప్రపంచం చాలా పేదదై పోయింది. దేశంలోని ప్రతి ఇంటికీ పరిచయమైన పేరు ఆయనది. ఆయన శ్రావ్యమైన స్వరం, సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌ ‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply