Take a fresh look at your lifestyle.

నీళ్ల దోపిడి ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారే..

సర్వ జనుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ : బిజెపి పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి నాగర్‌ ‌కర్నూల్‌, ‌మే 13. ప్రజాతంత్రవిలేకరి: కూష్ణా నీళ్ల దొంగతనాన్ని ఆపకపోతే దక్షిణ తెలంగాణ ఎడారయ్యే ప్రమాదం ఉందని బీజేపీ పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌ ‌రెడ్డి అన్నారు.కృష్ణా నది నీళ్ళు అక్రమ తరలింపుకు నిరసనగా మంగళవారం బీజేపీ ఆద్వర్యంలో ఆపార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నియామకా లు, నిధులు, స్వపరిపాలన కొరకు తెలంగాణలోని సర్వజనులు సుదీర్ఘ కాలం చేసిన పోరాటం ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్రం కళ నెరవేరిందని అన్నారు. ఉద్యమ పార్టీగా కెసిఆర్‌ ‌కుటుంబం అధికారాన్ని హస్తగ తం చేసుకుందని ద్న్నుయ్యబట్టారు. కెసిఆర్‌ ‌స్వార్ధ బుద్ధితో తెలంగాణ దక్షిణ ప్రాంతం మరోసారి నీళ్ల దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని అన్ననారు.అపర భగీరథుడు అని తన వందిమాగతుల చేత నిరంతరం పొగిడించు కుంటున్న కెసిఆర్‌ ‌పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కు లకు జీవో నెంబర్‌ 203 ‌ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన 6825 కోట్ల రూపాయల మరో ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతి ఇచ్చిందని అన్నారు.

ఇంత జఈగుతున్న కెసిఆర్‌ ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్‌ ‌తన మార్గదర్శనం లోనే నడుస్తున్నట్లు చెప్పుకుంటున్న కెసిఆర్‌, ‌దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలైనా పాలమూరు, రంగారెడ్డి నల్లగొండ జిల్లాలు నీరులేక ఎడారులు అయ్యే ప్రమాదం ఉందన్న సంగతి గ్రహించలేదా? అని ప్రశ్నించారు. ఎపి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్‌ ‌రెగ్యులేటరీ ద్వారా రోజు ఏడు టీఎంసీలు,సంగమేశ్వరం నుండి మూడు టీఎంసీల నీటిని మొత్తంగా 10 టీఎంసీలు అంటే ఒక లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని రోజూ ఎత్తి పోయడం వల్ల కృష్ణానదిని పూర్తిగా రాయలసీమ వైపు దిశ మార్చే కుతంత్రం జరుగుతున్నదనీ,. కాబట్టి వెంటనే మనం మేల్కొని ఉద్యమిం చకపోతే మన భవిష్యత్‌ ‌తరాలు మనల్ని క్షమించవు అని అన్నారు. నేను అనేది అంటుంటా నివ్వు చేసేది చెయ్యి అనే కెసిఆర్‌ ‌జగన్‌ ‌ల చాటుమాటు నాటకాలు గ్రహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నా రు. కెసిఆర్‌ ‌మెడలు వంచేందుకుభార తీయ జనతా పార్టీ ఉద్యమం చేయడానికి సంసిద్ధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్‌ అధ్యక్షుడు సలుకూటి యాదిరెడ్డి, బిసిమోర్చ టౌన్‌ అధ్యక్షుడు బొట్టుశ్రీను, రాజేశ్వర్‌ ‌రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply