Take a fresh look at your lifestyle.

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి

‘‘కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చెయ్యాలని క్యాబినేట్‌లో చే•సిన తీర్మానం అంత ఆశామాషీగా హడవిడిగా తీసుకున్న నిర్ణయంకాదు. రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల నుండి తీసుకున్న సమాచారం. సమీకరించి సమీక్షించి, తీసుకున్న నిర్ణయం. ఇది రాత్రికిరాత్రే చేసిన ప్రకటన కాదు. అయిన క్యాబినేట్‌ ‌నిర్ణయం అమలులో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావటం లేదు.’’

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి ఒక్క శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది . రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సింగ్‌, ఆశా వర్కర్లు అంగన్వాడీలు, వర్క్ ‌ఛార్జ్‌డ్‌, ‌దినసరి వేతన ఉద్యోగులందరికీ జీతాలు పెంచిన ఘనత కేసిఆర్‌ ‌ప్రభుత్వానిది. •.•ఆర్‌.‌సి. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల గురించి మాత్రమే సిఫారసు చేస్తుందనే భావనను పక్కనబెట్టి క్షేత్ర స్థాయి ఉద్యోగుల గురించి ఆలోచించిన కెసిఆర్‌ ‌ప్రభుత్వానికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్‌ల తోపాటు యావత్‌ ‌చిరె•• ఉద్యోగులంతా రుణపడి ఉంటారు. వేతన సవరణ అంశం చర్చకు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం కాంట్రాక్టు ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగుల గురించి ఆలోచనలు చేయడం గౌరవప్రదమైన వేతనాలు ఉండాలనే కెసిఆర్‌ ఆలోచనలను ఆయా ఉద్యోగులు వారి కుటుంబాలు ఎప్పుడూ మరువలేరు. ఇప్పుడు రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు చిన్నాచితకా ఉద్యోగులందరికీ జీతాలను పెంచాలన్న కెసిఆర్‌ ఆలోచనను ఉద్యోగ వర్గాల స్వాగతిస్తున్నాయి. ఆయనకు కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల మొదటి నుంచి స్పష్టమైన అవగాహన మంచి చేయాలనే ఆలోచన ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం 2014 జూలైలో జరిగిన క్యాబినెట్‌ ‌నిర్ణయం చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ ‌చెయ్యాలని క్యాబినేట్‌లో చే•సిన తీర్మానం అంత ఆశామాషీగా హడవిడిగా తీసుకున్న నిర్ణయంకాదు. రాష్ట్రప్రభుత్వం వివిధ శాఖల నుండి తీసుకున్న సమాచారం. సమీకరించి సమీక్షించి, తీసుకున్న నిర్ణయం. ఇది రాత్రికిరాత్రే చేసిన ప్రకటన కాదు. అయిన క్యాబినేట్‌ ‌నిర్ణయం అమలులో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావటం లేదు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారంలోకి రాకముందు, అనేక సందర్భలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించక ముందు దాదాపు అన్ని అంశాలులాగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ అం‌శంపై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది.

తెలంగాణా గెజిటెడ్‌ అధికారుల సంఘం, నాన్‌-‌గెజిటెడ్‌ అధికారుల సంఘం, తెలంగాణా ఉద్యోగుల సంఘం తో పాటు దాదాపు అన్నీ ఉద్యోగ సంఘాల జె.ఎ.సి.లు ఈ అంశాన్ని బహిరంగంగా సమర్ధించాయి. అంతేకాకుండా వారివారి కార్యవర్గాల సమావేశాల్లో ఈ అంశంపై అనేకసార్లు తీర్మానాలు కూడా చేశాయి. ఇప్పటికి అదే డిమాండ్‌ను సమర్ధిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కడో అకాశం నుండి ఊడిపడలేదు ఇక్కడి బిడ్డలే… నిరుద్యోగులే…. అనేక ఎండ్ల నుండి వెట్టిచాకిరి చేస్తూ… ఉద్యోగం కాపాడుకోవడం కోసం…. అధికారుల కనుసన్నులలో మెలిగి శ్రమ దోపిడికి గురైనవారే! చాలామంది పూర్తిస్థాయి అర్హతలు ఉండి పోస్ట్ ‌గ్యాడ్యుయేషన్‌, ‌డబుల్‌ ‌పోస్ట్ ‌గ్యాడ్యూయేషన్‌లు అపై చదివినవారే ! పేద, మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చి, వివిధ ప్రయ త్నాలు చేసి వయస్సు పైబడుతున్న వేళ, వచ్చిన చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగమే అయినా సరే, బ్రతకాడానికి కుటుంబ పోషణకు అవసరమై ఉద్యోగం చేస్తున్న వాళ్ళే !

వివిధ శాఖలు ఇచ్చిన పత్రికా ప్రకటనల మేరకు అర్హతలు ఉండి అప్లయ్‌ ‌చేసుకొని, పద్ధతి ప్రకారం వచ్చిన వాళ్ళే ! ప్రతి సంవత్సరం ఆర్దిక శాఖ అమోదించిన వాళ్ళే ! తప్పని సరిగా వారి సేవలు ఆయాశాఖల్లో అవసరం ఉన్న వాళ్ళే ఎండ్ల తరబడి చాలీ చాలనీ జీతాలు, అధికారుల బెదిరింపులు, తోటి రెగ్యులర్‌ ఉద్యోగుల చీదరింపులు తోటి క్రింది స్థాయి రెగ్యులర్‌ ఉద్యోగులు చేసిన అవమానాలు భరించిన వాళ్ళే ! భరిస్తున్న వాళ్ళే ! ఒక కార్యాలయంలోనె ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా పని చేస్తూ సంవత్సరంలో కేవలం నెలకు ఒకేఒక్క క్యాజువల్‌ ‌లీవు సంవత్సరానికి కేవలం 12 క్యాజువల్‌ ‌లీవులతో, రెగ్యులర్‌ ఉద్యోగులలాగా టైమ్‌ ‌ప్రకారం కాకుండా అధిక సమయాలు తీవ్ర పని ఒత్తిడితో, పనిచేస్తూ వ్యాధుల బాదిన పడినవారు ఎంతోమంది ఉన్నారు.తెలంగాణా ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర చిన్నది కాదు. సీమాంధ్ర అధికారులను, ప్రభుత్వాన్ని ఎదిరించి పనిచెయ్యడం అనేది ఉద్యోగాన్ని ఫణంగా పెట్టడమే! అయినాసరే రాజకీయ జె.ఎసి. ఉద్యోగ సంఘాల జె.ఎ.సిలు ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చెయ్యడంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ముందు వరసలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ‘‘ఉద్యోగంకన్నా ఉద్యమం మిన్న అన్న’’ విధంగా వ్యవహరించిన సంగతిని అందరూ గుర్తుంచుకోవాలి.

ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉద్యోగుల లో దాదాపు 20, 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ రిటైర్‌మెంట్‌కు దగ్గరైన వాళ్ళు ఎప్పుడైనా రెగ్యులరైజ్‌ ‌కాకపోతుందా… అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు క్యాబినేట్‌ ‌సమావేశంలో తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైనది. పదిమందికి ఉపయోగపడే మంచి నిర్ణయాలను వేగంగా తీసుకొనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన తొలి క్యాబినెట్‌ ‌నిర్ణయాన్ని అమలుపరచడంలో తగిన ఆదేశాలు జారీ చేస్తారనే విశ్వాసంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్‌ ‌పట్ల వారికి అపారమైన నమ్మకముంది. ఆర్‌.‌సి. కమిటీ సూచనల మేరకు ఎంప్లాయిస్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ (ఈ.‌హెచ్‌.ఎస్‌.) ‌నూతన విధి విధానాలు నిర్ణయించేందుకు సంఘాలు, ప్రభుత్వ అధికారులతో కూడిన స్టీరింగ్‌ ‌కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటుకాంట్రాక్టు, ఔట్‌ ‌సోర్సిం, ఇతర చిరుద్యోగులు అందరికీ ఎంప్లాయిస్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌కానీ మరే ఇతర పథకం కానీ వర్తింప చెయ్యాలి. కాంట్రాక్టు ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్లు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– సురేష్‌ ‌కాలేర, రాష్ట్ర సహ అధ్యక్షులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం, 9866174474

Leave a Reply